ఎమ్మెల్యే మనిషి.. అవినీతి అధికారి.. చర్యలు తీసుకోరా..?

దిశ, మణుగూరు : పినపాక మండల రెవిన్యూ కార్యాలయంలో అవినీతి అధికారి బాగోతం బయటపడింది. ఇదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మైపతి రాజేశ్వరరావు తనను లంచం అడిగాడు అంటూ రాజుపేట గ్రామానికి చెందిన బాదే వీరారెడ్డి అనే రైతు రికార్డెడ్ సీడీతో భద్రాద్రి జిల్లా కలెక్టర్‌కు గతేడాది ఫిర్యాదు చేశాడు. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ చేయాలని భద్రాద్రి సబ్ కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చి ఐదు నెలలు గడుస్తున్నా, ఇంతవరకు విచారణ […]

Update: 2021-05-15 20:38 GMT

దిశ, మణుగూరు : పినపాక మండల రెవిన్యూ కార్యాలయంలో అవినీతి అధికారి బాగోతం బయటపడింది. ఇదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మైపతి రాజేశ్వరరావు తనను లంచం అడిగాడు అంటూ రాజుపేట గ్రామానికి చెందిన బాదే వీరారెడ్డి అనే రైతు రికార్డెడ్ సీడీతో భద్రాద్రి జిల్లా కలెక్టర్‌కు గతేడాది ఫిర్యాదు చేశాడు. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ చేయాలని భద్రాద్రి సబ్ కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చి ఐదు నెలలు గడుస్తున్నా, ఇంతవరకు విచారణ పూర్తి చేయలేదని భాదితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

సదరు సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగి స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు మనిషి అని, అందుకే ఇంతవరకు అతని మీద చర్యలు తీసుకోలేదని రైతు ఆరోపిస్తున్నాడు. అంటే రైతుకు ఒక న్యాయం, ఎమ్మెల్యే మనిషికి ఒక న్యాయం అంటూ రోదిస్తున్నాడు. రైతు కుటుంబాల బతుకులను నాశనం చేసేది కొందరు రాజకీయ నాయకులు, కొందరు ప్రభుత్వ అధికారులే అని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకు ఈ సీనియర్ అసిస్టెంట్ మీద చర్యలు చేపట్టడం లేదని రైతు, ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ స్పందించి తగు న్యాయం చేయాలని, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగిని వెంటనే సస్పెండ్ చేయాలని భాదితుడు కోరుతున్నాడు.

Tags:    

Similar News