ఆ కంపెనీలు సెస్ చెల్లించట్లేదు : సీపీఎం
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దశాబ్ద కాలంగా భారీ ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ నిర్మాణ కంపెనీలు లేబర్ సెస్ చెల్లించడం లేదని సీపీఎం హైదరాబాద్ నగర కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు 65 నిర్మాణ కంపెనీలు లేబర్ల సంక్షేమానికి ఇవ్వాల్సిన ఒక శాతం సెస్ చెల్లించడం లేదని, వాటికి నోటీసులు జారీ చేసినా కూడా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఎల్ అండ్ టీ మెట్రో […]
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దశాబ్ద కాలంగా భారీ ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ నిర్మాణ కంపెనీలు లేబర్ సెస్ చెల్లించడం లేదని సీపీఎం హైదరాబాద్ నగర కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు 65 నిర్మాణ కంపెనీలు లేబర్ల సంక్షేమానికి ఇవ్వాల్సిన ఒక శాతం సెస్ చెల్లించడం లేదని, వాటికి నోటీసులు జారీ చేసినా కూడా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఎల్ అండ్ టీ మెట్రో రూ.300 కోట్లకు పైగా, ఇదే తరహాలో మిగతా కంపెనీలవీ వందల కోట్లు దాటిపోయాయని ఆరోపించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోనూ ఇలాంటి ఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయని, ఈ అంశాలపై తక్షణమే ఏసీబీ అధికారులతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం నగర కార్యదర్శివర్గసభ్యుడు ఎన్.శ్రీనివాసరావు, ఖైరతాబాద్ జోన్ కన్వీనర్ జి.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.