25 కోట్ల మందికి వ్యాక్సిన్

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జులైలోపు భారత దేశంలో సుమారు 25 కోట్ల మంది ప్రజలకు కరోనాను నిలువరించే టీకాను అందించడానికి ప్రణాళికలు జరుగుతున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ఇందుకోసం సుమారు 40 నుంచి 50 కోట్ల టీకా డోసులు ప్రభుత్వం దగ్గరకు చేరుతాయని వివరంచారు. టీకాను నిష్పక్షపాతంగా అవసరార్థులకు ముందుగా అందజేస్తామని చెప్పారు. కరోనా రిస్కు గ్రూపులు లేదా ముందుగా టీకా వేయాల్సిన గ్రూపులకు సంబంధించిన వివరాలను ఈ నెలలోపు కేంద్రానికి అందించాల్సిందిగా […]

Update: 2020-10-04 06:47 GMT

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జులైలోపు భారత దేశంలో సుమారు 25 కోట్ల మంది ప్రజలకు కరోనాను నిలువరించే టీకాను అందించడానికి ప్రణాళికలు జరుగుతున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ఇందుకోసం సుమారు 40 నుంచి 50 కోట్ల టీకా డోసులు ప్రభుత్వం దగ్గరకు చేరుతాయని వివరంచారు. టీకాను నిష్పక్షపాతంగా అవసరార్థులకు ముందుగా అందజేస్తామని చెప్పారు.

కరోనా రిస్కు గ్రూపులు లేదా ముందుగా టీకా వేయాల్సిన గ్రూపులకు సంబంధించిన వివరాలను ఈ నెలలోపు కేంద్రానికి అందించాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు. టీకాను కేంద్రమే సేకరిస్తుందని, ప్రతి ఆర్డర్‌ను రియల్ టైంలో ట్రాక్ చేస్తారని చెప్పారు. ముందుగా ఆరోగ్య సిబ్బందికి టీకాను అందించాలని భావిస్తున్నట్టు తెలిపారు. దేశంలోని టీకా తయారుదారులకు కేంద్రం అన్ని రకాలుగా మద్దతునిస్తుందని, టీకా అందరికీ అందుబాటులో ఉండే చర్యలు తీసుకోనున్నట్టు వివరించారు. సండే సంవాద్‌లో భాగంగా కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ సోషల్ మీడియాలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

Tags:    

Similar News