ఒక్క రోజులో 11,458 కేసులు.. 386 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి తీవ్రమవుతోంది. కేవలం ఒక్క రోజులోనే 11 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాలూ 386 చోటుచేసుకున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సమాచారం ప్రకారం శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 11,458 కేసులు రిపోర్ట్ అయ్యాయి. దీంతో దేశంలోని మొత్తం కేసులు 3 లక్షల మార్క్‌ను దాటేశాయి. శనివారం ఉదయానికి పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,993కు చేరగా, మరణాల సంఖ్య 8,884కు పెరిగింది.అత్యధిక కేసులున్న టాప్ 10 దేశాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యాల […]
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి తీవ్రమవుతోంది. కేవలం ఒక్క రోజులోనే 11 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాలూ 386 చోటుచేసుకున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సమాచారం ప్రకారం శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 11,458 కేసులు రిపోర్ట్ అయ్యాయి. దీంతో దేశంలోని మొత్తం కేసులు 3 లక్షల మార్క్‌ను దాటేశాయి. శనివారం ఉదయానికి పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,993కు చేరగా, మరణాల సంఖ్య 8,884కు పెరిగింది.అత్యధిక కేసులున్న టాప్ 10 దేశాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యాల తర్వాత భారత్ నాలుగో స్థానంలో ఉన్నది. కాగా, రికవరీ రేటు దాదాపు 50శాతంగా
ఉన్నది. ఈ వైరస్ నుంచి 1,54,330 మంది కోలుకున్నారు.
మహారాష్ట్ర ఎప్పటిలాగే అత్యధిక కేసులు, మరణాలతో అగ్రస్థానంలో ఉన్నది. ఈ రాష్ట్రంలో శుక్రవారం 3,493 కేసులు వెలుగుచూడటంతో మొత్తం కేసులు లక్షను దాటాయి. శనివారం ఉదయానికి మొత్తం కేసులు 1,01,141కు చేరగా, మరణాలు 3,717కు పెరిగాయి.
ఈ రాష్ట్రం తర్వాత స్థానాల్లో తమిళనాడు, ఢిల్లీలున్నాయి. తమిళనాడులో మొత్తం కేసులు 40,698కి చేరగా, ఢిల్లీలో 36,824కు పెరిగాయి.