కరోనా ఊరట.. కోలుకున్న 1,02,429
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. రోజురోజుకూ వైరస్ బారిన పడిన వారి సంఖ్య, వ్యాప్తిస్తున్న దేశాలు పెరిగిపోతున్నాయి. మొత్తం 184 దేశాలకు కరోనా పాకింది. ప్రపంచవ్యాప్తంగా 3,82,741 మందికి ఈ మహమ్మారి అంటుకుంది. దాదాపు 16,578 మంది మృతిచెందారు. అయితే, 102,522 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడం పెద్ద ఊరట కలిగించే అంశం. వీరందరూ ప్రస్తుతం హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్ ఉన్న 2,63,642 […]
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. రోజురోజుకూ వైరస్ బారిన పడిన వారి సంఖ్య, వ్యాప్తిస్తున్న దేశాలు పెరిగిపోతున్నాయి. మొత్తం 184 దేశాలకు కరోనా పాకింది. ప్రపంచవ్యాప్తంగా 3,82,741 మందికి ఈ మహమ్మారి అంటుకుంది. దాదాపు 16,578 మంది మృతిచెందారు. అయితే, 102,522 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడం పెద్ద ఊరట కలిగించే అంశం. వీరందరూ ప్రస్తుతం హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్ ఉన్న 2,63,642 మంది చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో 27 శాతం మంది కోలుకోవడం వైరస్ భయాందోళనల నేపథ్యంలో కాస్త ఊరట కలిగించే అంశం.
Tags: corona outbreak, great relief, 1 lakh people recovered throughout india