వైరస్‌లను చంపగలమా?

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్‌లపై అవగాహన చేసుకోవడానికి సమాచారం ప్రాధాన్యత మరింత పెరుగుతోంది. ఇప్పటికే 6 రకాల కరోనా వైరస్ లకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు భయాందోళనకు గురవుతున్న ఇప్పటి కరోనా వైరస్ 7వ జాతికి చెందినదిగా భావిస్తున్నారు. ఇప్పటివరకూ లేని కొత్త జన్యు రూపంతో బయటపడడంతో దీనిని నావల్ కరోనా వైరస్ అని, 2019 లో కనుగొనడంతో నావల్ కరోనా వైరస్-19 అని […]

Update: 2020-03-26 08:31 GMT

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్‌లపై అవగాహన చేసుకోవడానికి సమాచారం ప్రాధాన్యత మరింత పెరుగుతోంది. ఇప్పటికే 6 రకాల కరోనా వైరస్ లకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు భయాందోళనకు గురవుతున్న ఇప్పటి కరోనా వైరస్ 7వ జాతికి చెందినదిగా భావిస్తున్నారు. ఇప్పటివరకూ లేని కొత్త జన్యు రూపంతో బయటపడడంతో దీనిని నావల్ కరోనా వైరస్ అని, 2019 లో కనుగొనడంతో నావల్ కరోనా వైరస్-19 అని నామకరణం చేశారు. దీని ద్వారా వచ్చే జబ్బును కోవిడ్- 19గా వ్యవహరిస్తున్నారు. ఈ వైరస్ జెనె మ్యాపింగ్ ను కూడా తెలుసుకున్నారు. అన్ని వైరస్ ల లాగే ఇదికూడా ఒక వైరస్ మాత్రమే. కాకుంటే కొత్త జన్యు రూపంతో ఉన్నందున దీని గురించి ఎక్కువ విషయాలు మానవాళికి తెలియలేదు. ప్రస్తుతం పరిశోధన దశలో ఉంది.

వైరస్ బలహీనమైనదే..

వైరస్ అనేది కొవ్వు కణాలతో ఆవరించబడిన ఒక ప్రొటీన్. ఇది ఒక నిర్జీవి. అంతే కానీ, జీవి మాత్రం కాదు. ఇది కంటి, ముక్కు, గొంతులోని కణాలతో కలిసినప్పుడు తన జన్యు కోడ్‌ను మార్చుకొని, ఆ కణాలను చైతన్యవంతమయ్యేలా చేస్తోంది. అంతేకాక, అవి మరిన్ని సంఖ్యలో వృద్ధి చెందేలా చేస్తుంది. వైరస్ అనేది జీవి కానందున, దీనిని చంపడం అనేది కుదరదు. దానంతట అదే నాశనం అవుతోంది. ఉష్టోగ్రత, గాలిలో తేమ, అది ఉన్న ప్రదేశాల ఆధారంగా వైరస్ నాశనం అవుతుంది. వాస్తవానికి వైరస్ చాలా బలహీనమైనది. తేలికగా విచ్ఛిన్నమయ్యే గుణం కలిగినది. కానీ, దానికి రక్షణ కవచంగా ఉన్న కొవ్వు కణాల వలన అది బలం సంతరించుకుంటుంది. అందుకే సబ్బు, డిటర్జెంట్స్ వాడటం వలన, వాటి నుంచి వచ్చే నురగు కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి సబ్బు తదితర పదార్థాలతో కనీసం 20 సెకన్లు గట్టిగా రుద్దమని చెబుతారు. అట్లా చేయడం వలన కొవ్వు కణాలు విచ్ఛిన్నమై, లోపల వున్న వైరస్ ( ప్రోటీన్) కూడా దానంతట అదే విచ్చిన్నమవుతోంది. వేడి కొవ్వును కరిగిస్తుందన్న విషయం మనకు తెలుసు. అందుకే 25 డిగ్రీల కంటే ఎక్కువ వేడి వున్న నీటితో చేతులు, బట్టలు, ఇతరాలను శుభ్రపరచుకోవాలి. వేడి నీటికి ఎక్కువ నురగ నిచ్చే లక్షణం కూడా ఉంటుంది. నురగ ఎంత ఎక్కువగా ఉంటే, వైరస్‌ను కూడా అంత సులభంగా కరిగించగలం. కొవ్వులు ఆల్కహాల్‌ లో కరుగుతాయి. అందుకే 65% తగ్గని ఆల్కహాల్ లేదా ఆల్కహాల్‌ మిశ్రమాలు ఉపయోగించడం ద్వారా వైరస్‌ను నిర్వీర్యం చేయవచ్చు. ఒకవంతు బ్లీచింగ్ పౌడర్, 5 వంతుల నీరు కలిపిన మిశ్రమాన్ని ఉపయోగించినట్లయితే వైరస్‌లోని ప్రోటీన్ అణువులను విచ్ఛిన్నం చేసి, వైరస్‌ను నిర్వీర్యం చేయవచ్చు. హైడ్రోజన్ పెరాక్సైడ్‌కు ప్రొటీన్( వైరస్) అణువులను విచ్ఛిన్నం చేసే శక్తి ఉన్నది. అందుకే చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్లలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగిస్తారు.

యాంటీబయాటిక్స్ దీన్ని చంపలేవు

వైరస్ నిర్జీవి అయినందున యాంటీబయాటిక్స్ నిర్వీర్యం చేయలేవు. వాటి నిర్మాణాన్ని కొంతమేరకు కుదించగలవు. బాక్టీరియాను మాత్రమే యాంటీబయాటిక్స్ చంపగలవు. ఒకసారి ఉపయోగించిన, ఉపయోగించని బట్టలను దులపడం లేదా విదిలించడం చేయరాదు. వాటిలో వైరస్ ఉంటుంది. బట్టలపై 3 గంటలు, సహజసిద్ధమైన యాంటిసెప్టిక్ అయిన రాగిపై 4 గంటలు, చెక్కపై 4 గంటలు, కప్‌బోర్డు పై 24 గంటలు, లోహాలపై 42 గంటలు, ప్లాస్టిక్ పై 72 గంటలు వైరస్ నిర్వీర్యం కాకుండా ఉంటుంది. వైరస్ ఉన్న బట్టలు, ఇతరాలను మనం దులిపినపుడు వైరస్ గాలిలో కలసి సుమారు 3 గంటలు ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి గాలిని మనం పీల్చినప్పుడు మన ముక్కు ద్వారా వైరస్ ఊపిరితిత్తుల లోనికి ప్రవేశిస్తుంది. వైరస్‌లు చల్లని వాతావరణంలో, ఎయిర్ కండిషనర్ల ద్వారా ఏర్పడే కృత్రిమ చల్లదనంలో, చీకటిలో “వాటి అస్తిత్వాన్ని నిలకడగా కొనసాగిస్తాయి”. అందుకే మన పరిసరాలను తేమలేకుండా, పొడిగా, వెచ్చగా, వెలుతురుతో ఉండేలా చూసుకోవాలి. అల్ట్రా వయొలెట్ కిరణాలు కూడా వైరస్‌లోని ప్రొటీన్ లను విచ్ఛిన్నం చేస్తాయి. కానీ.. ఇవి చర్మంపై పడితే (మన చర్మం లోని కొలాజిన్ అనే ప్రొటీన్ ను విచ్ఛిన్నం చేస్తాయి) చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యవంతమైన మానవుని చర్మం ద్వారా ఈ వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించలేవు. వెనిగర్‌కు కొవ్వును కరిగించే శక్తి లేదు. నలభై శాతం కన్నా తక్కువ ఆల్కహాల్ కలిగిన స్పిరిట్, వోడ్కాల వలన కూడా వైరస్‌ను కట్టడి చేయలేం. వైరస్ నిర్వీర్యం కావాలంటే 65% ఆల్కహాల్ కావాలి. లిస్టరిన్ (65 శాతం ఆల్కహాల్ కలిగిన) వలన కొంత ఉపయోగం ఉంటుంది.

సబ్బుతో కడుక్కోవడమే మార్గం

విశాలమైన ప్రదేశం, గాలి, వెలుతురు దారాళంగా ఉంటే వైరస్ తీవ్రత తక్కువగా ఉంటుంది. తక్కువ వెలుతురు, గాలి కలిగిన ప్రదేశంలో, తక్కువ ఏరియాలో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఆహార పదార్థాలు, తాళాలు, తలుపుల నాబ్స్, స్విచ్‌లు, రిమోట్స్, సెల్‌ఫోన్, వాచీలు, కంప్యూటర్‌లు, డెస్కులు, టీవీలు ముట్టుకున్నప్పుడు, బాత్రూమ్ కు వెళ్ళినప్పుడు తప్పక చేతులు సబ్బులు ఉపయోగించి 20 సెకన్లకు తగ్గకుండా శుభ్రం చేసుకోవాలి. చేతులు ఎప్పుడూ తడిగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఎండిన చేతుల్లోని పగుళ్ళలో వైరస్ దాక్కొనే అవకాశం ఉంటుంది. మనం ఉపయోగించే మాయిస్చరైజర్ ఎంత చిక్కగా ఉంటే వైరస్‌ను విచ్ఛిన్నం చేయడానికి అంతగా ఉపయోగపడుతుంది. గోళ్ళ సందుల్లో వైరస్ ఉండకుండా, గోళ్ళ పరిమాణం చాలా తక్కువ వుండేలా చూసుకోవడం కూడా చాలా ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు.

Tags : coronavirus, Hopkins University, antibiotics, corona lockdown

Tags:    

Similar News