కరోనా నివారణకు ‘దివిస్’చేయూత
దిశ నల్లగొండ: కరోనా నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ క్వారంటైన్‌లలో మౌళిక సౌకర్యాల కోసం చౌటుప్పల్ దివిస్ సంస్థ రూ.36లక్షల సామగ్రిని అందజేసింది. ఆసంస్థ డిప్యూటీ మేనేజర్ సుధాకర్ ఆ జిల్లా అడిషనల్ కలెక్టర్ రమేష్‌కు ఈ సామాగ్రిని అందజేశారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కాలేదన్నారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 116 మందిని క్వారంటైన్‌కు తరలించినట్టు చెప్పారు. ఢిల్లీ మర్కజ్‌కు […]
దిశ నల్లగొండ: కరోనా నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ క్వారంటైన్‌లలో మౌళిక సౌకర్యాల కోసం చౌటుప్పల్ దివిస్ సంస్థ రూ.36లక్షల సామగ్రిని అందజేసింది. ఆసంస్థ డిప్యూటీ మేనేజర్ సుధాకర్ ఆ జిల్లా అడిషనల్ కలెక్టర్ రమేష్‌కు ఈ సామాగ్రిని అందజేశారు.
అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కాలేదన్నారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 116 మందిని క్వారంటైన్‌కు తరలించినట్టు చెప్పారు. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన 12 మందిని గుర్తించి వారిని ఐసోలేషన్‌కు తరలించామని తెలిపారు. ఇందులో 9మందికి నెగిటివ్ వచ్చిందని, మిగితా ముగ్గురికి సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సాంబశివరావు, దివిస్ ప్రతినిధులు ఆర్ నర్సింహ్మ, బి క్రిష్ణకుమార్ తదితరులు ఉన్నారు.
Tags: yadadri,quarantine ward,36 laksh,Supplies,Divis