గుడ్‌న్యూస్.. రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాక్సిన్ ఉచితం: కేంద్ర ఆరోగ్య శాఖ

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాక్సిన్‌ను ఉచితంగానే సరఫరా చేస్తామని ఓ ప్రకటన విడుదల చేసింది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ డోసులను రూ. 150కే కొనుగోలు చేస్తామని స్పష్టం చేస్తూనే.. ఇలా కొనుగోలు చేసిన వ్యాక్సిన్‌లను రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం ఉచితంగానే సరఫరా చేస్తామని ప్రకటనలో వెల్లడించింది. కాగా, ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా.. చాలా వరకు డోసులు అందుబాటులో ఉండడం […]

Update: 2021-04-24 00:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాక్సిన్‌ను ఉచితంగానే సరఫరా చేస్తామని ఓ ప్రకటన విడుదల చేసింది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ డోసులను రూ. 150కే కొనుగోలు చేస్తామని స్పష్టం చేస్తూనే.. ఇలా కొనుగోలు చేసిన వ్యాక్సిన్‌లను రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం ఉచితంగానే సరఫరా చేస్తామని ప్రకటనలో వెల్లడించింది. కాగా, ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా.. చాలా వరకు డోసులు అందుబాటులో ఉండడం లేదు. ఈ మేరకు పలు ప్రభుత్వాలు వ్యాక్సిన్‌ను పంపించాలని కేంద్ర ప్రభుత్వానికి, ఆరోగ్య మంత్రికి లేఖలు రాశాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ ఉచితంగానే వ్యాక్సిన్‌లను సరఫరా చేస్తామని ప్రకటించడం విశేషం.

Tags:    

Similar News