దారికాచి సూది కుచ్చి.. వైకుంఠధామం వద్దా వదలని వైద్యసిబ్బంది

దిశ,తుంగతుర్తి: బడిలో, గుడిలో, సంతలో.. బస్టాండ్‌లో.. చివరికి మనిషి జీవితాన్ని తనలో కలుపుకునే వైకుంఠధామం అయినా… కాదేది కరోనా టీకాలకు అనర్హం…! అన్నట్లు ఉంది తుంగతుర్తి మండలంలో.. మండల వైద్య సిబ్బంది కరోనా వ్యాక్సిన్ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇవ్వడానికి పడుతున్న పాట్లకు ఇక్కడున్న చిత్రమే నిదర్శనం. సోమవారం కేశవాపురం గ్రామానికి వెళుతున్న వైద్య సిబ్బంది రజితకు గ్రామ పొలిమేరలో ఉన్న వైకుంఠధామం ముందు నుండచి వెళ్తున్న ఒకరిద్దరు గ్రామస్తులు కనిపించడంతో వారిని ఆపి అక్కడే వ్యాక్సిన్ […]

Update: 2021-12-13 11:31 GMT

దిశ,తుంగతుర్తి: బడిలో, గుడిలో, సంతలో.. బస్టాండ్‌లో.. చివరికి మనిషి జీవితాన్ని తనలో కలుపుకునే వైకుంఠధామం అయినా… కాదేది కరోనా టీకాలకు అనర్హం…! అన్నట్లు ఉంది తుంగతుర్తి మండలంలో.. మండల వైద్య సిబ్బంది కరోనా వ్యాక్సిన్ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇవ్వడానికి పడుతున్న పాట్లకు ఇక్కడున్న చిత్రమే నిదర్శనం. సోమవారం కేశవాపురం గ్రామానికి వెళుతున్న వైద్య సిబ్బంది రజితకు గ్రామ పొలిమేరలో ఉన్న వైకుంఠధామం ముందు నుండచి వెళ్తున్న ఒకరిద్దరు గ్రామస్తులు కనిపించడంతో వారిని ఆపి అక్కడే వ్యాక్సిన్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని“దిశ” కెమెరాలో బంధించింది. ఈ దృశ్యాన్ని చూసిన సర్పంచ్ మిరియాల అనితాజనార్ధన్, గ్రామస్తులు.. హాట్సాఫ్ రజిత అని ఆమె సేవలను కొనియాడారు.

Tags:    

Similar News