నిత్యావసర సరుకులకు కరోనా కష్టాలు..

దిశ, న్యూస్‌ బ్యూరో: కరోనా వైరస్ (కోవిడ్ -19) కట్టడికి లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిత్యావసర సరుకుల కొనాలంటే ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రవాణ వ్యవస్థ ఎక్కడిక్కడా స్థంభించి పోయింది. రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే నిత్యావసర సరుకులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రంలో నిత్యావసర సరుకుల కొరత తారస్థాయికి చేరింది. పరిస్థితి ఇలానే కొనసాగితే నిత్యావసరాలు అందించడం కష్టమవుతుందని వర్తక వ్యాపారులు చెబుతున్నారు. సరిహద్దుల వద్ద పకడ్బందీ గస్తీ.. కరోనా వైరస్ […]

Update: 2020-03-27 09:25 GMT

దిశ, న్యూస్‌ బ్యూరో: కరోనా వైరస్ (కోవిడ్ -19) కట్టడికి లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిత్యావసర సరుకుల కొనాలంటే ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రవాణ వ్యవస్థ ఎక్కడిక్కడా స్థంభించి పోయింది. రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే నిత్యావసర సరుకులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రంలో నిత్యావసర సరుకుల కొరత తారస్థాయికి చేరింది. పరిస్థితి ఇలానే కొనసాగితే నిత్యావసరాలు అందించడం కష్టమవుతుందని వర్తక వ్యాపారులు చెబుతున్నారు.

సరిహద్దుల వద్ద పకడ్బందీ గస్తీ..

కరోనా వైరస్ నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కఠినమైన నిర్ణయాలు అమలు అవుతుండటంతో పూర్తి స్థాయిలో రవాణ వ్యవస్థ స్థంభించి పోయింది. రాష్ట్ర సరిహద్దుల చెక్ పోస్టుల వద్ద పకడ్బందీగా పోలీసులు గస్తి కాస్తు వాహనాలకు అడ్డుకుంటున్నారు. దీంతో తెలంగాణకు రావాల్సిన సరుకులు ఏవీ రావడం లేదు.

బోసిపోయిన హోల్‌సేల్ మార్కెట్లు..

నిత్యం వేల మందితో కిటకిటలాడే హైదరాబాద్ మహానగరంలోని అతిపెద్ద న్యూమలక్‌పేట్ హోల్‌సేల్ మార్కెట్ సరుకులు లేక వెలవెలబోతుంది. సరుకులు లేకపోవడంతో వ్యాపారులు దుకాణాలు మూసేసుకున్నారు. నిత్యం ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 200 ట్రాన్స్‌పోర్టు వాహనాలు నిత్యావసర సరుకులను దిగుమతి చేస్తుండేవి. కరోనా వైరస్ ప్రభావంతో వారం రోజుల నుంచి లాక్‌డౌన్ అమలులో ఉండటంతో ఒక లోడు సరుకులు కూడా దిగుమతి కాలేదు. దీంతో వ్యాపారులు ఉన్న సరుకులను మాత్రమే విక్రయిస్తున్నారు. ప్రసుత్తం ఉన్న సరుకులు కూడా ఒకటి, రెండ్రోజుల్లో కంప్లిట్ అయితే షాపులు ముసివేయాల్సి వస్తుందని వ్యాపారుల వాపోతున్నారు. నిత్యావసర సరుకుల వాహనాలకు అనుమతి ఇవ్వాలని ఇటీవల హోల్‌సేల్ మార్కెట్ వ్యాపారులు పౌర సరఫర శాఖ కమిషనర్‌తో మాట్లాడారు. అయితే, ప్రసుత్తం ఉన్న సరుకును మాత్రమే విక్రయించండనీ, ఇతర రాష్ట్రాల నుంచి సరుకులు దిగుమతి చేసుకోవడం కష్టంగా ఉందని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ప్రజలకు కావాల్సిన అత్యవసరమై సరుకులు బియం, పప్పు, నూనె, చెక్కర, పండి వంటివి తప్ప మిగతా సరుకులు దిగుమతి చేసుకోవడం కష్టమైన పని అని అంటున్నారు. తెలంగాణకు మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి పండి, కందిపప్పు, చెక్కర, గుజరాత్ నుంచి ఉప్పు, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ల నుంచి శనగపప్పు దిగుమతులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చి ఆయ రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి సరుకులను దిగుమతి చేసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు. లేని పక్షంలో ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం కష్టం తరమైన పని అంటున్నారు. ఓడరేవులు కృష్టపట్నం, కాకినాడ, ఓడరేవుల నుంచి దిగుమతి అయ్యే నూనె దిగుమతి చేసుకునే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవావాలని వేడుకుంటున్నారు.

Tags : Traders, goods, Maharashtra,Karnataka,Madhya Pradesh, Chhattisgarh

Tags:    

Similar News