మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి కరోనా
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చికిత్స కోసం భోపాల్‌లోని చిరాయు హాస్పిటల్‌లో అతను చేరనున్నారు. కొన్నాళ్లుగా తనకు కరోనా లక్షణాలు కనిపించాయని, టెస్టు చేసుకుంటే పాజిటివ్‌గా తేలినట్టు సీఎం ట్విట్టర్‌లో తెలిపారు. అన్ని నిబంధనలు పాటించి వైద్యుల సలహామేరకు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్తారని వివరించారు. తనతో సన్నిహితంగా మెలిగినవారంతా కరోనా టెస్టు చేయించుకోవాలని కోరారు. భయపడాల్సిన అవసరమేమీ లేదని, సమయానికి చికిత్స తీసుకుంటే ఈ వైరస్ తగ్గిపోతుందని […]
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చికిత్స కోసం భోపాల్‌లోని చిరాయు హాస్పిటల్‌లో అతను చేరనున్నారు. కొన్నాళ్లుగా తనకు కరోనా లక్షణాలు కనిపించాయని, టెస్టు చేసుకుంటే పాజిటివ్‌గా తేలినట్టు సీఎం ట్విట్టర్‌లో తెలిపారు. అన్ని నిబంధనలు పాటించి వైద్యుల సలహామేరకు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్తారని వివరించారు. తనతో సన్నిహితంగా మెలిగినవారంతా కరోనా టెస్టు చేయించుకోవాలని కోరారు.
భయపడాల్సిన అవసరమేమీ లేదని, సమయానికి చికిత్స తీసుకుంటే ఈ వైరస్ తగ్గిపోతుందని తెలిపారు. కరోనా వచ్చినప్పటికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని పరిస్థితులను సమీక్షించడానికి ప్రయత్నిస్తారని వివరించారు. క్యాబినెట్ మంత్రి అరవింద్ సింగ్ బదోరియాకు కరోనా సోకినట్టు వార్తలు వచ్చిన రెండు రోజులకు సీఎంకు పాజిటివ్ తేలినట్టుగా నిర్ధారణ అయింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో బదోరియా కూడా హాజరయ్యారు.