వైద్యశాఖ అలర్ట్.. తెలంగాణలో థర్డ్ వేవ్ సంకేతాలు.?

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో థర్డ్​వేవ్​వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సెకండ్​వేవ్‌లో వచ్చిన డెల్టాతో పోల్చితే ఒమిక్రాన్ ఏకంగా​ఆరు రెట్లు స్పీడ్‌గా వ్యాప్తి చెందుతుందని, మరీ ముఖ్యంగా గాలిలోనూ స్ప్రెడింగ్​ఉంటుందని సాక్షాత్తు ఆరోగ్యశాఖ ప్రకటనను గమనిస్తే కచ్చితంగా మరో ప్రమాదం పొంచి ఉన్నదని అర్ధం అవుతోంది. మరణాలు, విషమ పరిస్థితులు లేకపోయినా వైరస్​ఎక్కువ మందికి అంటుకుంటుందని సైంటిస్టులు, డాక్టర్లు, నిపుణులు చెబుతున్నారు. విదేశీ ప్రయాణీకులతో మొదటి, సెకండ్ వేవ్‌లు వచ్చినట్లే ఈ సారి కూడా […]

Update: 2021-12-15 20:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో థర్డ్​వేవ్​వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సెకండ్​వేవ్‌లో వచ్చిన డెల్టాతో పోల్చితే ఒమిక్రాన్ ఏకంగా​ఆరు రెట్లు స్పీడ్‌గా వ్యాప్తి చెందుతుందని, మరీ ముఖ్యంగా గాలిలోనూ స్ప్రెడింగ్​ఉంటుందని సాక్షాత్తు ఆరోగ్యశాఖ ప్రకటనను గమనిస్తే కచ్చితంగా మరో ప్రమాదం పొంచి ఉన్నదని అర్ధం అవుతోంది. మరణాలు, విషమ పరిస్థితులు లేకపోయినా వైరస్​ఎక్కువ మందికి అంటుకుంటుందని సైంటిస్టులు, డాక్టర్లు, నిపుణులు చెబుతున్నారు. విదేశీ ప్రయాణీకులతో మొదటి, సెకండ్ వేవ్‌లు వచ్చినట్లే ఈ సారి కూడా మూడో వేవ్ తప్పదని స్వయంగా అధికారులే ఆఫ్​ది రికార్డులో ఒప్పుకుంటున్నారు.

రాష్ట్రంలో తేలిన ఒమిక్రాన్​ కేసుల తీరును గమనిస్తే థర్డ్​ వేవ్‌ను ఎదుర్కోవాల్సిందే. ఎట్​రిస్క్ దేశాల నుంచి రాని వారిలోనూ ఒమిక్రాన్​ తేలడం ఆందోళన కల్గించే అంశం. అంటే తెలియకుండా కమ్యూనిటీలోకి వ్యాప్తి వెళ్లిందేమోనని అధికారులు టెన్షన్​పడుతున్నారు. ఎయిర్​పోర్టులో పకడ్బంధీగా స్క్రీనింగ్, టెస్టింగ్‌లు నిర్వహించినా కొత్త వేరియంట్​ఎలా ప్రవేశిందోనని ఆందోళన చెందుతున్నారు. నాన్​రిస్క్​కంట్రీస్​నుంచి వచ్చిన వ్యక్తులకు ఎక్కడ్నుంచి వైరస్​ సోకింది? అనే విషయాలపై కూడా అన్వేషిస్తున్నారు. ఒక వేళ బుధవారం తేలిన బాధితులకు ఇక్కడే వైరస్ అంటుకున్నట్లయితే సామూహిక వ్యాప్తి జరిగిందని నొక్కి చెప్పవచ్చు. దీనిపై అధికారులు పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.

తాజా నిర్ణయాలు దేనికి..?

ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త నిర్ణయాలను గమనిస్తే థర్డ్ వేవ్​తప్పేలా లేదు. కంటైన్‌మెంట్లు, ఇంటింటికీ ఐసోలేషన్​కిట్లు, అన్ని బెడ్లకు ఆక్సిజన్, స్టాఫ్‌ను సమకూర్చడం, వైద్యసిబ్బందితో అత్యవసర మీటింగ్‌లు, టెస్టుల సంఖ్య పెంపు వంటివన్నీ ముందస్తు ఏర్పాట్లని అధికారులు పైకి చెబుతున్నా, థర్డ్​వేవ్​ వస్తుందని ఫుల్​క్లారిటీతోనే సమకూర్చుతున్నారు. దీంతో పాటు విదేశీ పాజిటివ్‌లనే కాకుండా నెగెటివ్‌ల ట్రేసింగ్‌లు, డబ్ల్యూహెచ్ఓ, కేంద్రం ప్రకటనలన్నీ థర్డ్​వేవ్‌కు సూచికగా కనిపిస్తున్నాయి.

మరోవైపు జనవరి 15 తర్వాత కేసుల సంఖ్య పతాక స్థాయిలోకి వెళ్తాయని వైద్యాధికారులే పేర్కొంటున్నారు. దీంతోనే వ్యాక్సినేషన్‌ను స్పీడప్​ చేశారు. కానీ ఇతర దేశాల్లో రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా ఒమిక్రాన్​ తేలింది. అంటే కొత్త వేరియంట్‌పై వ్యాక్సిన్ల ప్రభావం మెరుగ్గా లేదని ఆయా దేశాల డాక్టర్లు ప్రకటిస్తున్నారు. ఈ లెక్కన ఒమిక్రాన్​ రూపంలో మూడో వేవ్​ వస్తుందని అధికారులూ బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో ప్రతీ ఒక్కరూ మరో 8 వారాల పాటు మాస్కు, భౌతిక దూరం, శానిటేషన్​వంటి ప్రక్రియలను సమర్ధవంతంగా పాటించాల్సిందేనని ఆరోగ్యశాఖ హెచ్చరించింది.

RTPCRకు చిక్కని వైరస్.. ఎయిర్‌పోర్టు టెస్టులపై అనుమానాలు

Tags:    

Similar News