మూడు జిల్లాల్లో కరోనా పరీక్షలు

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా పరిస్థితిపై అంచనాకు వచ్చేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని 69 జిల్లాల్లో కరోనా పరీక్షలు నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగా తెలంగాణలోని కామారెడ్డి, జనగాం, నల్గొండ జిల్లాలను ఎంపిక చేశారు. ఒక్కో జిల్లాలో 10 క్లస్టర్లుగా 400 మంది చొప్పున మొత్తం 1,200 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక కుటుంబంలోని పెద్దల్లోఒకరికి మాత్రమే పరీక్ష నిర్వహించడంతో పాటు కుటుంబాల్లోని వ్యక్తులను […]

Update: 2020-05-12 10:56 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా పరిస్థితిపై అంచనాకు వచ్చేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని 69 జిల్లాల్లో కరోనా పరీక్షలు నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగా తెలంగాణలోని కామారెడ్డి, జనగాం, నల్గొండ జిల్లాలను ఎంపిక చేశారు. ఒక్కో జిల్లాలో 10 క్లస్టర్లుగా 400 మంది చొప్పున మొత్తం 1,200 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక కుటుంబంలోని పెద్దల్లోఒకరికి మాత్రమే పరీక్ష నిర్వహించడంతో పాటు కుటుంబాల్లోని వ్యక్తులను ర్యాండమ్‌గా ఎంపిక చేస్తారు. జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్ఐవి), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్తంగా అభివృద్ధి చేసి ఎలిసా పరీక్షలను నిర్వహించి ఆ ప్రాంతంలో కరోనా ప్రభావాన్ని అంచనా వేస్తారు.

Tags:    

Similar News