నీలోఫర్‌లో చిన్నారులందరికీ కరోనా పరీక్షలు చేయాలి
దిశ, హైదరాబాద్: నీలోఫర్‌లో చికిత్స పొందుతున్న చిన్నారులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే క్రమంలో చికిత్స పొందుతున్న చిన్నారులందరికీ వైద్య సేవలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. నీలోఫర్ ఆస్పత్రిలో చిన్నారికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ నెల 14, 15, 16 తేదీల్లో పనిచేసిన డాక్టర్లు, నర్సులు ఇతర సిబ్బంది అంతా క్వారంటైన్‌కి వెళ్తున్న నేపథ్యంలో పిల్లల వైద్యానికి ఇబ్బంది లేకుండా […]
దిశ, హైదరాబాద్: నీలోఫర్‌లో చికిత్స పొందుతున్న చిన్నారులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే క్రమంలో చికిత్స పొందుతున్న చిన్నారులందరికీ వైద్య సేవలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. నీలోఫర్ ఆస్పత్రిలో చిన్నారికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ నెల 14, 15, 16 తేదీల్లో పనిచేసిన డాక్టర్లు, నర్సులు ఇతర సిబ్బంది అంతా క్వారంటైన్‌కి వెళ్తున్న నేపథ్యంలో పిల్లల వైద్యానికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ప్రైవేటు వైద్య సేవలు గానీ, ఇతర ఆస్పత్రుల్లో ఉన్న పిల్లల వైద్య నిపుణులతో నీలోఫర్‌లో సేవలందించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.
tags: Coronavirus, Niloufer Hospital, Doctors, Nurses, Children, Children’s Rights Society, Hyderabad