తిరువనంతపురం సెంట్రల్ జైలులో కరోనా కలకలం
దిశ, వెబ్ డెస్క్: కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అన్‌లాక్ ప్రక్రియ మొదలైన నాటి నుంచి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా తిరువనంతపురం సెంట్రల్ జైలులో ముగ్గురు అధికారులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అంతేకాకుండా మరో 50మంది ఖైదీలకు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని జైళ్ల శాఖ డీఐజీ సంతోష్ ప్రకటించారు. ఇదిలావుంటే, మరోవైపు కేరళ సీఎం పినరయ్ విజయన్ కూడా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. […]
దిశ, వెబ్ డెస్క్: కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అన్‌లాక్ ప్రక్రియ మొదలైన నాటి నుంచి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా తిరువనంతపురం సెంట్రల్ జైలులో ముగ్గురు అధికారులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అంతేకాకుండా మరో 50మంది ఖైదీలకు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని జైళ్ల శాఖ డీఐజీ సంతోష్ ప్రకటించారు.
ఇదిలావుంటే, మరోవైపు కేరళ సీఎం పినరయ్ విజయన్ కూడా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇటీవల కోజికోడ్ విమాన ప్రమాద ఘటన జరిగిన ప్రదేశాన్ని ఆయన సందర్శించారు. అయితే, అక్కడి సహాయక చర్యల్లో పాల్గొన్న పలువురు అధికారులు కరోనా బారిన పడ్డారు. దీంతో సీఎం విజయన్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు సీఎంవో ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా దేశంలో మొదట కేరళ రాష్ట్రంలోనే వెలుగు చూడగా, ఆ తర్వాత కంట్రోల్ లోకి వచ్చింది. తాజాగా మళ్లీ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురువుతున్నట్లు తెలుస్తోంది.