‘జీ7’ భారత ప్రతినిధుల్లో ఇద్దరికి పాజిటివ్
న్యూఢిల్లీ: యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) నిర్వహిస్తున్న జీ7 సదస్సుకు వెళ్లిన భారత ప్రతినిధుల బృందంలో ఇద్దరికి కరోనా పాజిటివ్ తేలింది. దీంతో లండన్ వెళ్లిన భారత ప్రతినిధులందరూ ఐసొలేషన్‌లో ఉన్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌కు కరోనా నెగెటివ్‌గా వచ్చినట్టు బ్రిటన్ అధికారులు బుధవారం వెల్లడించారు. బ్రిటీష్ ఇంటీరియర్ మినిస్టర్ ప్రీతి పటేల్‌ను జైశంకర్ మంగళవారం కలిసినట్టు ఓ ఫొటో కనిపించింది. భారత ప్రతినిధులకు పాజిటివ్ తేలడంతో జీ7 సదస్సులో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. తాము […]
న్యూఢిల్లీ: యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) నిర్వహిస్తున్న జీ7 సదస్సుకు వెళ్లిన భారత ప్రతినిధుల బృందంలో ఇద్దరికి కరోనా పాజిటివ్ తేలింది. దీంతో లండన్ వెళ్లిన భారత ప్రతినిధులందరూ ఐసొలేషన్‌లో ఉన్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌కు కరోనా నెగెటివ్‌గా వచ్చినట్టు బ్రిటన్ అధికారులు బుధవారం వెల్లడించారు. బ్రిటీష్ ఇంటీరియర్ మినిస్టర్ ప్రీతి పటేల్‌ను జైశంకర్ మంగళవారం కలిసినట్టు ఓ ఫొటో కనిపించింది. భారత ప్రతినిధులకు పాజిటివ్ తేలడంతో జీ7 సదస్సులో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. తాము వర్చువల్ మోడ్‌లో ఈ సమావేశంలో హాజరు కావడానికి ప్రయత్నిస్తామని జైశంకర్ వివరించారు. జీ7 సదస్సు కోసం యూకే ఫారీన్ సెక్రెటరీ డొమినిక్ రాబ్ ఆహ్వానంపై జైశంకర్ లండన్ వెళ్లారు. సోమవారం తన నాలుగు రోజుల పర్యటన మొదలుపెట్టారు.