టెన్షన్ పెడుతున్న ఒమిక్రాన్.. ఎయిర్‌పోర్టులో ఆరుగురికి లక్షణాలు..?

దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా మహమ్మారి మరోసారి ప్రజా జీవనాన్ని గందరగోళం చేసేందుకు తన రూపాన్ని మార్చుకొని అతివేగంగా వ్యాప్తి చెందుతోంది. గత రెండేళ్లుగా ఆర్థికంగా కృంగదీసిన వైరస్.. లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం వైరస్ వ్యాప్తి తగ్గిపోవడంతో భారత్‌లో యదార్థ స్థితి నెలకొనగా.. మరో వేరియంట్ ఒమిక్రాన్ తాజాగా ప్రజలను కలవరపెడుతోంది. చాప కింద నీరులా వేగంగా వ్యాప్తి చెందుతూ కొద్ది సమయంలోనే 20 దేశాలకు పాకింది. కేవలం […]

Update: 2021-12-02 01:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా మహమ్మారి మరోసారి ప్రజా జీవనాన్ని గందరగోళం చేసేందుకు తన రూపాన్ని మార్చుకొని అతివేగంగా వ్యాప్తి చెందుతోంది. గత రెండేళ్లుగా ఆర్థికంగా కృంగదీసిన వైరస్.. లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం వైరస్ వ్యాప్తి తగ్గిపోవడంతో భారత్‌లో యదార్థ స్థితి నెలకొనగా.. మరో వేరియంట్ ఒమిక్రాన్ తాజాగా ప్రజలను కలవరపెడుతోంది. చాప కింద నీరులా వేగంగా వ్యాప్తి చెందుతూ కొద్ది సమయంలోనే 20 దేశాలకు పాకింది. కేవలం యూరప్ దేశాలలోనే దాదాపు 44 మంది ఒమిక్రాన్ బాధితులు ఉన్నారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాల ప్రభుత్వాలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

విస్తీర్ణంలో, జనాభాలో అతి పెద్ద దేశం కావడంతో భారత ప్రభుత్వం ఒమిక్రాన్‌ను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులలో ఆంక్షలు విధించింది. ఇతర దేశాల నుంచి ప్రతీ ఒక్క ప్రయాణికుడికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తూ ప్రభుత్వాలు జల్లడ పడుతున్నాయి. ఇదిలా ఉండగా విదేశీ ప్రయాణికుల్లో బుధవారం ఆరుగురికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో వెంటనే వారి శ్యాంపుల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్స్‌కు పంపి వారిని క్వారంటైన్ చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రజలను అలర్ట్ చేస్తూ టీకాలను వంద శాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.

 

Tags:    

Similar News