కాకినాడ ఎంపీకి కరోనా పాజిటివ్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో రోజూ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సామాన్యులకే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, హీరోలకు వైరస్ సోకుతూ విజృంభిస్తోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎంపీ వంగా గీతకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆమె హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. అంతేగాకుండా శుక్రవారం వరకూ అమె పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నది. దీంతో […]
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో రోజూ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సామాన్యులకే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, హీరోలకు వైరస్ సోకుతూ విజృంభిస్తోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎంపీ వంగా గీతకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆమె హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. అంతేగాకుండా శుక్రవారం వరకూ అమె పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నది. దీంతో ఆమె పాటు కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధుల్లో కరోనా భయం మొదలైంది.