నలుగురు ఖైదీలకు కరోనా పాజిటివ్

దిశ, జనగామ: జనగామ సబ్ జైల్లో నలుగురు రిమాండ్ ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు జైలర్ ఉపేందర్ తెలిపారు. శుక్రవారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో 23 మంది రిమాండ్ ఖైదీలు, తొమ్మిది మంది జైలు సిబ్బందితో కలిపి మొత్తంగా 32 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఐదు రోజుల క్రితం జనగామ పట్టణ పోలీసులు పట్టుకున్న ద్విచక్ర వాహన దొంగల ముఠాలోని పది మందిలో నలుగురికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఈ మేరకు జైలు […]

Update: 2020-07-31 05:28 GMT

దిశ, జనగామ: జనగామ సబ్ జైల్లో నలుగురు రిమాండ్ ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు జైలర్ ఉపేందర్ తెలిపారు. శుక్రవారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో 23 మంది రిమాండ్ ఖైదీలు, తొమ్మిది మంది జైలు సిబ్బందితో కలిపి మొత్తంగా 32 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఐదు రోజుల క్రితం జనగామ పట్టణ పోలీసులు పట్టుకున్న ద్విచక్ర వాహన దొంగల ముఠాలోని పది మందిలో నలుగురికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఈ మేరకు జైలు సిబ్బంది పాజిటివ్ వచ్చిన ఖైదీలను వేరువేరు బ్యారక్‌లో క్వారంటైన్‌లో ఉంచినట్టు తెలిపారు. వైద్యుల సూచనల మేరకు అవసరమైన ఔషధాలు సైతం అందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో జైలు సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విధులు నిర్వర్తిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.

Tags:    

Similar News