బోధన్‌లో వైద్య సిబ్బందికి కరోనా
దిశ, బోధన్: బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ ఆస్పత్రి వైద్య సిబ్బంది కుటుంబ సభ్యుల్లో మరో నలుగురికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. గురువారం బోధన్ ప్రభుత్వాస్పత్రిలో కరోనా ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 16 మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో ఏడుగురికి కరోనా సోకింది. కరోనా పాజిటివ్ వచ్చిన ముగ్గురు వైద్య సిబ్బంది స్టాఫ్ నర్సులుగా […]
దిశ, బోధన్: బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ ఆస్పత్రి వైద్య సిబ్బంది కుటుంబ సభ్యుల్లో మరో నలుగురికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. గురువారం బోధన్ ప్రభుత్వాస్పత్రిలో కరోనా ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 16 మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో ఏడుగురికి కరోనా సోకింది. కరోనా పాజిటివ్ వచ్చిన ముగ్గురు వైద్య సిబ్బంది స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్నారు. వారిలో ఒక స్టాఫ్ నర్స్ కుమారుడికి, అత్తకు పాజిటివ్ రాగా, అలాగే మరో స్టాఫ్ నర్స్ భర్త జర్నలిస్టు కాగా, అతనికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. ఆస్పత్రిలో టెక్నీషియన్‌గా పని చేస్తున్న ఒక వ్యక్తి భార్యకు కూడా కరోనా పాజిటివ్ అని తేలినట్టు తెలిపారు.