గురుకులంలో కరోనా కలకలం.. 46 మందికి పాజిటివ్
దిశ, పటాన్‌చెరు: విద్యార్థులకు ఆఫ్ లైన్ ద్వారా విద్యా బోధన జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పాఠశాలలకు అనుమతి ఇచ్చింది. కొవిడ్ మహమ్మారి పూర్తిగా అంతం కాకముందే పాఠశాలలను తెరవడంతో వైరస్ మరోసారి పడగ విప్పింది. పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామంలోని ఓ ప్రభుత్వ వసతి గృహంలో భారీ సంఖ్యలో విద్యార్థులు కొవిడ్ బారిన పడ్డారు. సమాచారం అందుకున్న వెనుకబడిన తరగతుల సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యదర్శి మల్లప్ప బట్ట, సంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ గాయత్రి దేవితో […]
దిశ, పటాన్‌చెరు: విద్యార్థులకు ఆఫ్ లైన్ ద్వారా విద్యా బోధన జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పాఠశాలలకు అనుమతి ఇచ్చింది. కొవిడ్ మహమ్మారి పూర్తిగా అంతం కాకముందే పాఠశాలలను తెరవడంతో వైరస్ మరోసారి పడగ విప్పింది. పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామంలోని ఓ ప్రభుత్వ వసతి గృహంలో భారీ సంఖ్యలో విద్యార్థులు కొవిడ్ బారిన పడ్డారు. సమాచారం అందుకున్న వెనుకబడిన తరగతుల సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యదర్శి మల్లప్ప బట్ట, సంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ గాయత్రి దేవితో పాటు జిల్లా ఉన్నత అధికారులు హుటాహుటిన వసతి గృహానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు.
సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకుల పాఠశాలలో 42 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలికి కరోనా నిర్ధారణ అయింది. ఈ పాఠశాలలో 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. 261 మంది విద్యార్థులకు, 27 మంది సిబ్బందికి ఆదివారం కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే వారికి పాజిటివ్ వచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం జరిపిన పరీక్షలతో కలిపి 45 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను వైద్యాధికారులు జీనోమ్ స్వీక్వెన్సింగ్‌కు పంపారు. వసతి గృహంలోనే క్వారంటైన్‌లో ఉంచి విద్యార్థులకు వైద్యసేవలు అందిస్తున్నారు. కరోనా బారిన పడిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యాఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మిగిలిన విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు కొనసాగుతున్నాయి.