14మంది అంధులకు కరోనా

దిశ, న్యూస్‌బ్యూరో: వికలాంగులకు, అంగవైకల్యం గలవారికి కరోనా వస్తే ? అంధులకే కరోనా మహమ్మారి సంక్రమిస్తే.. సాయం చేసే వారెవరుంటారు? సహాయకులు లేకుండా కరోనా వచ్చిన వారు ఎలాగోలా నెట్టుకురావచ్చు. సహాయకులు లేని కరోనా వచ్చిన అంధుల పరిస్థితిని ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెహదీపట్నంలోని సాలార్జంగ్ కాలనీలోని అంధుల వసతి గృహంలో వార్డెన్, స్టాఫ్ నర్సుతో పాటు 14మంది అంధులు కరోనా వైరస్ బారిన పడ్డారు. వారికి పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఆ వసతిగృహంలో […]

Update: 2020-07-28 06:21 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: వికలాంగులకు, అంగవైకల్యం గలవారికి కరోనా వస్తే ? అంధులకే కరోనా మహమ్మారి సంక్రమిస్తే.. సాయం చేసే వారెవరుంటారు? సహాయకులు లేకుండా కరోనా వచ్చిన వారు ఎలాగోలా నెట్టుకురావచ్చు. సహాయకులు లేని కరోనా వచ్చిన అంధుల పరిస్థితిని ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెహదీపట్నంలోని సాలార్జంగ్ కాలనీలోని అంధుల వసతి గృహంలో వార్డెన్, స్టాఫ్ నర్సుతో పాటు 14మంది అంధులు కరోనా వైరస్ బారిన పడ్డారు. వారికి పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఆ వసతిగృహంలో ఉన్నవారి కథనం ప్రకారం వారంరోజుల క్రితం వార్డెన్ భర్తకు కరోనా సోకింది. ఆమె క్వారంరైన్‌కు వెళ్లకుకుండా, ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. దాంతో వార్డెన్ విధులకు హాజరైన కారణంగా మరో 14మందికి కరోనా సోకడానికి కారకురాలైందని ఆలిండియా కాన్ఫడరేషన్ ఆఫ్ ద బ్లైండ్(ఏఐసీబీ) సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు ఆర్.స్వామినాయక్ మంగళవారం ఆరోపించారు.

కరోనా సమయంలో భౌతికదూరం తప్పనిసరి. సామర్థ్యం కలిగిన, ఇండ్లున్న అంధులను ఇంటికి పంపించాలి. ఇల్లు, కుటుంబాలు లేని అనాథలను, వృద్ధులను మాత్రమే ఇలాంటి పరిస్థితుల్లో వసతిగృహాల్లో ఉంచాలి. కానీ ఈ నిబంధనలను గాలికొదిలేశారు. దానికి బదులుగా అందరినీ హాస్టల్లోనే ఉంచారు. కేంద్ర, రాష్ట్రాలు సూచించిన విధంగా భౌతికదూరాన్ని పాటించలేదు. అధికారుల సూచనలను వార్డెన్ పట్టించుకోలేదని అన్నారు. ఒక హాస్టల్ సౌకర్యాలను విస్తరించాలన్న అభ్యర్ధుల వినతులను ఏనాడూ పట్టించుకోలేదు. దాంతో ఇప్పుడు 14 మంది అంధులు కరోనాను బారిన పడ్డారు. వారికిప్పుడు ఎవరు సేవ చేస్తారన్న సంశయం కలుగుతోంది. చాలా రోజులుగా తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా పరిశీలించలేదు. అన్నీ చెత్తబుట్టలో వేశారు. పరిశీలిస్తాం.. అంటూ అధికారులు ఆ విషయాలన్నీ దాటవేశారు. భవిష్యత్తులో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు అంధులకే కరోనా సోకింది. సామాన్యులకే వారి కుటుంబ సభ్యులే సేవలందించేందుకు ముందుకు రావడంలేదు. అంధుల పరిస్థితి ప్రతేకంగా చెప్పనక్కరలేదని నాయక్ వాపోయారు.

Tags:    

Similar News