ఏపీలో కరోనా @381
ఆంధ్రప్రదేశ్‌పై కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. పదుల సంఖ్యలో నమోదవుతున్న కేసులు రాష్ట్ర ప్రభుత్వానికి నిద్రపట్టనివ్వడం లేదు. పదుల సంఖ్యలో నమోదవుతున్న కేసుల కారణంగా సీఎం సమీక్షలు, లాక్డౌన్ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సత్ఫలితాలనిచ్చినట్టు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రతి రోజూ రెండు పర్యాయాలు తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా కరోనా కేసుల వివరాలు వెల్లడిస్తోంది. ఒకపూట తెరిపినిచ్చినట్టు కనిపించిన కేసులు […]
ఆంధ్రప్రదేశ్‌పై కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. పదుల సంఖ్యలో నమోదవుతున్న కేసులు రాష్ట్ర ప్రభుత్వానికి నిద్రపట్టనివ్వడం లేదు. పదుల సంఖ్యలో నమోదవుతున్న కేసుల కారణంగా సీఎం సమీక్షలు, లాక్డౌన్ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సత్ఫలితాలనిచ్చినట్టు కనిపించడం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రతి రోజూ రెండు పర్యాయాలు తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా కరోనా కేసుల వివరాలు వెల్లడిస్తోంది. ఒకపూట తెరిపినిచ్చినట్టు కనిపించిన కేసులు మరో బులిటెన్ విడుదలయ్యేసరికి అందరి ఆలోచనలను తల్లకిందులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ ఆరోగ్యాంధ్ర విడుదల చేసిన కరోనా ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 16 కేసులు నమోదయ్యాయి.
నిన్న ఉదయం 9 నుంచి రాత్రి 7 ఏడు గంటల వరకు జరిగిన కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షల్లో కొత్తగా 16 కేసులు నమోదు కావడంతో ఏపీలో మొత్తం 381 కేసులు నమోదయ్యాయని వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా గుంటూరులో 7, తూర్పు గోదావరి లో 5, కర్నూలులో 2, ప్రకాశంలో 2 కేసుల చొప్పున నమోదైనట్టు వివరించింది.
ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించిన పేషెంట్ల తాలూక ఇళ్ల ప్రాంతాలను రెడ్ అలెర్ట్ జోన్లో ఉంచామని ప్రభుత్వం తెలిపింది. అంతే కాకుండా వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వారితో సంబంధాలు నెరపిన వారందర్నీ క్వారంటైన్‌కి తరలించి, వారిపై నిఘా ఉంచామని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Tags: corona virus, covid-19, arogyaandhra, twitter, health department