ఏపీలో 8,61,092కి చేరిన కరోనా కేసులు

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో 68,307మందికి పరీక్షలు నిర్వహించగా 1,160 మందికి పాజిటివ్‌‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,61,092కి చేరింది. ఏడుగురు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 6,927కు పెరిగింది. ప్రస్తుతం 14,770 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,39,395 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 1,765 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 95,43,177మందికి పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనా మహమ్మారి బారిన పడి చిత్తూరు […]

Update: 2020-11-21 06:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో 68,307మందికి పరీక్షలు నిర్వహించగా 1,160 మందికి పాజిటివ్‌‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,61,092కి చేరింది. ఏడుగురు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 6,927కు పెరిగింది. ప్రస్తుతం 14,770 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,39,395 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 1,765 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 95,43,177మందికి పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి బారిన పడి చిత్తూరు జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా అనంతపురం జిల్లాలో ఒకరు, తూర్పుగోదావరిలో ఒకరు, గుంటూరులో ఒకరు, కడపలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు చనిపోయారు.

అనంతపురం జిల్లాలో 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 148, తూర్పుగోదావరిలో 165, గుంటూరులో 121, కడపలో 70, కృష్ణాలో 189, కర్నూలులో 23, నెల్లూరులో 60, ప్రకాశంలో 66, శ్రీకాకుళంలో 46, విశాఖపట్నంలో 67, విజయనగరంలో 42, పశ్చిమగోదావరి జిల్లాలో 120 కేసులు వచ్చినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Tags:    

Similar News