రాష్ట్రంలో 16వేలు దాటిన కరోనా

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృత వ్యాప్తి ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రోజూ తొమ్మిదివందలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతూ, విలయతాండవం చేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రజలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 945 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 16,339కి చేరింది. ఇందులో 8,785 యాక్టివ్ కేసులు ఉండగా, […]

Update: 2020-06-30 09:55 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృత వ్యాప్తి ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రోజూ తొమ్మిదివందలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతూ, విలయతాండవం చేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రజలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 945 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 16,339కి చేరింది. ఇందులో 8,785 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకూ వైరస్ బారిన పడి 7,294 మంది డిశ్చార్జి అయ్యారు. కాగా వైరస్ మూలంగా ఇవాళ మరో ఏడుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 260కి చేరింది.

Tags:    

Similar News