15లక్షలు దాటిన కరోనా కేసులు
దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒకటిన్నర మిలియన్ (15 లక్షలు) దాటింది. ప్రపంచంలోనే అత్యధిక వేగంతో కొత్త కేసులు పెరుగుతున్న దేశం భారత్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. గడచిన వారంరోజుల గణాంకాలను విశ్లేషించగా భారత్‌లో సగటున 3.6% చొప్పున కొత్త కేసులు నమోదవుతున్నాయని, బ్రెజిల్‌లో ఇది 2.4%గా ఉంటే, అమెరికాలో 1.6% మాత్రమేనని పేర్కొంది. కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం ఉదయం బులెటిన్ వెల్లడించే సమయానికి గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా […]
దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒకటిన్నర మిలియన్ (15 లక్షలు) దాటింది. ప్రపంచంలోనే అత్యధిక వేగంతో కొత్త కేసులు పెరుగుతున్న దేశం భారత్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. గడచిన వారంరోజుల గణాంకాలను విశ్లేషించగా భారత్‌లో సగటున 3.6% చొప్పున కొత్త కేసులు నమోదవుతున్నాయని, బ్రెజిల్‌లో ఇది 2.4%గా ఉంటే, అమెరికాలో 1.6% మాత్రమేనని పేర్కొంది. కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం ఉదయం బులెటిన్ వెల్లడించే సమయానికి గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 47,703 కొత్త కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 14,83,156కు చేరింది. కానీ సాయంత్రానికి వివిధ రాష్ట్రాలు హెల్త్ బులెటిన్‌లు వెల్లడించడంతో మొత్తం కేసుల సంఖ్య 15లక్షలు దాటింది.
వైరస్ బారినపడి దేశంలో ఒక్కరోజే 654 మంది మరణించడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 33,425కు చేరింది. కరోనా మరణాల్లో భారత్ ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇక రికవరీ విషయంలో 9,52,743 మంది కోలుకోగా ఇంకా 4,96,988 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీలో మాత్రం తగ్గుముఖం పట్టింది. మహారాష్ట్రలో ఒక్క రోజులో 7,717 పాజిటివ్ కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 3,91,440కు చేరింది. రాష్ట్రంలో 24గంటల్లో వైరస్ బారినపడి 282మంది చనిపోగా మొత్తం మరణాలు 14,165కు చేరాయి. తమిళనాడులో 24 గంటల్లో 6972 పాజిటివ్‌లు నమోదై మొత్తం కేసుల సంఖ్య 2,27,688కు చేరింది. ఇక్కడ కొత్తగా కరోనాతో 88 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 3659కి చేరింది. గుజరాత్‌లో ఇప్పటివరకు నమోదైన మొత్తం 57,982 కేసులకు గాను భారీ స్థాయిలో 2372 ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో గడిచిన 24 గంటల్లో 7948 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,297కి చేరింది. ఒక్కరోజే 58 మంది చనిపోయారు. ఇప్పటివరకు వైరస్ సోకి 1148 మంది మృత్యువాత పడ్డారు.