ఏపీలో 2లక్షలకు చేరువలో కరోనా కేసులు
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత వారంరోజులుగా 10వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 10,328 పాజిటివ్‌లు రావడంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 96వేల 789కి చేరింది. ఇవాళ 72మంది మరణించడంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,753గా ఉంది. ప్రస్తుతం 82,166 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనాకు చికిత్స తీసుకొని లక్షా 12వేల 870మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ 8,516 మంది డిశ్చార్జ్ […]
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత వారంరోజులుగా 10వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 10,328 పాజిటివ్‌లు రావడంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 96వేల 789కి చేరింది. ఇవాళ 72మంది మరణించడంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,753గా ఉంది. ప్రస్తుతం 82,166 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనాకు చికిత్స తీసుకొని లక్షా 12వేల 870మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ 8,516 మంది డిశ్చార్జ్ అయ్యారు.
కరోనా బారిన పడి గడిచిన 24గంటల్లో అనంతపురం జిల్లాలో 10మంది చనిపోగా తూర్పుగోదావరి 10, గుంటూరు 9, చిత్తూరు 8, కృష్ణా 6, విశాఖపట్నం 4, కడప 3, విజయనగరం 3, పశ్చిమగోదావరి ముగ్గురు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు చొప్పున మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 22లక్షల 99వేల 332మందికి శాంపిల్స్ పరీక్షించారు. ఇవాళ 63,686మందికి టెస్టులు చేసినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ వెల్లడించింది.