తెలంగాణ భవన్‌లో కరోనా కలకలం

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ భవన్‌లో కరోనా కలకలం రేపుతోంది. ప్రధాన ద్వారం వద్ద నిత్యం విధుల్లో ఉండే బంజారాహిల్స్ ఏఎస్ఐ వసంత్ నాయక్ శుక్రవారం కరోనా బారినపడ్డారు. దీంతో ఇక్కడి సెక్యూరిటీతో పాటు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తీవ్ర జ్వరం, తుమ్ములతో అవస్థ పడుతున్న వసంత్ నాయక్ శుక్రవారం కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. అతడితో మరికొంత మంది సిబ్బంది కూడా విధులు నిర్వహించినట్టు సమాచారం. అయితే, వారిలో ఎవరికైనా కరోనా సోకిందా అన్న […]

Update: 2021-04-03 08:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ భవన్‌లో కరోనా కలకలం రేపుతోంది. ప్రధాన ద్వారం వద్ద నిత్యం విధుల్లో ఉండే బంజారాహిల్స్ ఏఎస్ఐ వసంత్ నాయక్ శుక్రవారం కరోనా బారినపడ్డారు. దీంతో ఇక్కడి సెక్యూరిటీతో పాటు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తీవ్ర జ్వరం, తుమ్ములతో అవస్థ పడుతున్న వసంత్ నాయక్ శుక్రవారం కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. అతడితో మరికొంత మంది సిబ్బంది కూడా విధులు నిర్వహించినట్టు సమాచారం. అయితే, వారిలో ఎవరికైనా కరోనా సోకిందా అన్న భయం పట్టుకుంది. మరోవైపు‌ ఒక్క రోజులోనే కరోనా కేసులు వెయ్యి దాటడం మరింత ఆందోళన కలిగిస్తోంది. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం క్వారంటైన్‌ సెంటర్లను రీఓపెన్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో సెకండ్ వేవ్ ప్రభావం ఎంత మేరకు ఉంటుందో ఏమో అని ప్రజలు భయభ్రాంతులకు గురువుతున్నారు. మరోవైపు కరోనా నివారణకు కూడా ప్రభుత్వం తగు ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది.

Tags:    

Similar News