డ్యాన్సులు చేస్తున్న కరోనా పేషెంట్లు

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం కరోనాతో ప్రపంచమంతా గజగజ వణికిపోతుంది. ఈ కరోనా కారణంగా ప్రజలుకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఇటు కరోనా బారిన పడిన వారు తీవ్ర మనోవేదన గురవుతున్నారు. అయితే కొంతమంది కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. ఈ మధ్య ముంబై 80 ఏళ్ల వృద్ధుడు కరోనా బారిన పడి క్రమంగా కోలుకుని ఆస్పత్రిలోనే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఇలా చాలామంది బాధితులు కరోనా బారిన పడి క్రమంగా […]

Update: 2020-07-23 21:26 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం కరోనాతో ప్రపంచమంతా గజగజ వణికిపోతుంది. ఈ కరోనా కారణంగా ప్రజలుకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఇటు కరోనా బారిన పడిన వారు తీవ్ర మనోవేదన గురవుతున్నారు. అయితే కొంతమంది కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. ఈ మధ్య ముంబై 80 ఏళ్ల వృద్ధుడు కరోనా బారిన పడి క్రమంగా కోలుకుని ఆస్పత్రిలోనే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఇలా చాలామంది బాధితులు కరోనా బారిన పడి క్రమంగా కోలుకుంటున్నారు. అయితే, ఈ విషయమై తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఈ వీడియో కరోనా బారిన పడి తీవ్ర మనోవేదనకు గురవుతున్న వారికి భరోసా ఇచ్చేదిగా ఉంది. ఇది చూస్తే వారు కూడా వాళ్ల మేం కరోనాను జయించగలమన్న భరోసా కలగనున్నది. అదేమిటంటే.. అస్సోంలోని డిబ్రుఘర్హ్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్ పలువురు కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. అయితే వారు క్రమ క్రమంగా కోలుకుంటున్నారు. ఈ క్రమంలో వాళ్లు క్వారంటైన్ సెంటర్ లో వాళ్లందరూ పాటలు పాడుతూ.. డ్యాన్సులు చేస్తూ కనిపిస్తుంటారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

Tags:    

Similar News