కరోనా రోగి పరార్.. రైల్వేస్టేషన్‌లో మృతి
దిశ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆస్పత్రి నుంచి శుక్రవారం తప్పించుకుని వెళ్లిపోయిన కరోనా పాజిటివ్ రోగి శనివారం ఉదయం రైల్వే స్టేషన్‌లో విగతజీవిగా మారాడు. జిల్లాలోని దమ్మపేట మండలం నాచారం గ్రామానికి చెందిన పిల్లి వెంకటేశ్వర్లు కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలో చేరి చికిత్స పొందుతున్నాడు. అయితే వార్డులో చికిత్స పొందుతున్న మిగతా రోగుల్లో ఇద్దరు గురు, శుక్రవారాల్లో మరణించడంతో ఆందోళన చెందాడు. అక్కడే ఉంటే […]
దిశ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆస్పత్రి నుంచి శుక్రవారం తప్పించుకుని వెళ్లిపోయిన కరోనా పాజిటివ్ రోగి శనివారం ఉదయం రైల్వే స్టేషన్‌లో విగతజీవిగా మారాడు. జిల్లాలోని దమ్మపేట మండలం నాచారం గ్రామానికి చెందిన పిల్లి వెంకటేశ్వర్లు కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలో చేరి చికిత్స పొందుతున్నాడు.
అయితే వార్డులో చికిత్స పొందుతున్న మిగతా రోగుల్లో ఇద్దరు గురు, శుక్రవారాల్లో మరణించడంతో ఆందోళన చెందాడు. అక్కడే ఉంటే తాను చనిపోతానని భావించి వార్డులోంచి బయటకు వచ్చి ఆస్పత్రి గోడదూకి పారిపోయాడు. వైద్యులు గుర్తించి ఈ మేరకు బంధువులకు ఫోన్ చేసి చెప్పారు. అలా పారిపోయి వచ్చిన వెంకటేశ్వర్లు శుక్రవారం రాత్రి రైల్వేస్టేషన్ ఆవరణలో పడుకున్నాడు.
ఉదయం 10 గంటలైనా లేవకపోవడంతో అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మరణించినట్లుగా నిర్ధారించుకుని డాక్టర్లకు సమాచారం అందించారు. డాక్టర్లు పారిపోయి వచ్చిన వెంకటేశ్వర్లుగా గుర్తించి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఊపిరాడక మృతి చెంది ఉంటాడని వైద్యులు చెబుతున్నారు.