ప్లాస్మా దాతలపై ఫోకస్ పెట్టండి : కేటీఆర్
దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ మహమ్మారి బారిన పడి కోలుకునే వారి సంఖ్య బాగానే ఉన్నా.. మరణాల సంఖ్య కూడా ఇటీవల పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ కరోనా వైరస్ పై స్పందిచారు. ఈ వైరస్ ఇప్పట్లో పోయేలా లేదని.. ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి సౌకర్యాల కొరత ఉన్నా వెంటనే స్పందించాలని, ముఖ్యంగా ప్లాస్మా దాతలపై ఫోకస్ పెట్టాలని సంబధిత అధికారులను […]
దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ మహమ్మారి బారిన పడి కోలుకునే వారి సంఖ్య బాగానే ఉన్నా.. మరణాల సంఖ్య కూడా ఇటీవల పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ కరోనా వైరస్ పై స్పందిచారు. ఈ వైరస్ ఇప్పట్లో పోయేలా లేదని.. ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎక్కడ ఎలాంటి సౌకర్యాల కొరత ఉన్నా వెంటనే స్పందించాలని, ముఖ్యంగా ప్లాస్మా దాతలపై ఫోకస్ పెట్టాలని సంబధిత అధికారులను ఆదేశించారు. డోనర్స్‌ను ప్రోత్సహించాలని.. అదేవిధంగా ప్రతి జిల్లాలో పార్టీ భవనాల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. విపక్షాల విషయంలో రాజీ పడొద్దని, కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడినా ఎదురుదాడికి దిగాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.