మంచిర్యాల సేఫ్..!

దిశ, ఆదిలాబాద్: కరోనాతో మహిళ మృతి చెందిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా వాసులకు వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా పోయింది. తొలినుండి లాక్‌డౌన్‌ను కలెక్టర్ భారతి హోళీకేరి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం కఠినంగా అమలు చేసిన నేపథ్యంలో కరోనా కట్టడి‌లో ఉంది. అలాగే మర్కజ్ వెళ్లి వచ్చిన వారి సంఖ్య జిల్లాలో తక్కువగా ఉండడం, విదేశాలనుండి వచ్చినవారు ఎక్కువగా లాక్‌డౌన్‌కు ముందుగానే రావడం కలిసి వచ్చిన అంశం. […]

Update: 2020-04-22 07:57 GMT

దిశ, ఆదిలాబాద్: కరోనాతో మహిళ మృతి చెందిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా వాసులకు వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా పోయింది. తొలినుండి లాక్‌డౌన్‌ను కలెక్టర్ భారతి హోళీకేరి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం కఠినంగా అమలు చేసిన నేపథ్యంలో కరోనా కట్టడి‌లో ఉంది. అలాగే మర్కజ్ వెళ్లి వచ్చిన వారి సంఖ్య జిల్లాలో తక్కువగా ఉండడం, విదేశాలనుండి వచ్చినవారు ఎక్కువగా లాక్‌డౌన్‌కు ముందుగానే రావడం కలిసి వచ్చిన అంశం. అయితే జిల్లాలోని చెన్నూరు మండలం ముత్తురావుపేట గ్రామానికి చెందిన మహిళ కరోనా బారిన పడి.. మృతి చెందిన తర్వాత ఆమెకు కరోనా ఉందని తేలడం లాంటి పరిణామాలు జిల్లా వాసులను గందరగోళానికి గురి చేశాయి. ఈ నేపథ్యంలోనే అనేక మంది అనుమానితులను క్వారంటైన్ చేసిన అధికారులు వారి నుంచి సేకరించిన శాంపిళ్లను పరీక్షకు పంపారు.

103 మంది శాంపిల్‌లు నెగెటివ్

మంచిర్యాల జిల్లాలో మహిళకు కరోనా సోకి మృతి చెందడంతో జిల్లా వ్యాప్తంగా అనేక మంది అనుమానితులను అధికార యంత్రాంగం క్వారంటైన్ చేసింది. ఆ మహిళ పాల్గొన్న పెళ్లితో పాటు ఒక శుభకార్యంలో పాల్గొన్న 40మందిని గుర్తించారు. అలాగే మంచిర్యాలలో ఆమెను పరీక్షించిన వైద్య సిబ్బంది మరికొందరు అనుమానితులను కలిపి 63మందిని క్వారంటైన్ చేశారు. అనంతరం వీరి నుంచి సేకరించిన నమూనాలను హైదరాబాద్ లేబరేటరీకి పంపించారు. కాగా మొత్తం 103 ఫలితాలు మంగళ, బుధవారాల్లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరాయి. ఈ ఫలితాలు నెగెటివ్ రావడంతో అధికార యంత్రాంగం అంతా ఊపిరి పీల్చుకుంది.

కట్టడి‌లోనే ముత్తురావుపేట

ఇదిలా ఉండగా కరోనాతో మృతిచెందిన మహిళ స్వగ్రామం చెన్నూరు మండలం ముత్తురావు పేట గ్రామంలో నిషేధాజ్ఞలు కఠినంగా అమలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి ఇప్పటికే అధికార యంత్రాంగంతో కలిసి గ్రామాన్నిమూడు సార్లు సందర్శించారు. ఆ గ్రామంలోకి ఎవరిని వెళ్ళనివ్వకుండా కట్టుదిట్టం చేశారు.

Tags: coronavirus, death of woman, negative for 103 Members, Mancherial, Mutturavupet, Collector Bharati Holikeri, Lockdown

Tags:    

Similar News