దేశంలో కరోనా కేసులు 42,836
– 24 గంటల్లో 2,573 కొత్త కేసులు – తమిళనాడులో కార్చిచ్చులా కరోనా దిశ, న్యూస్ బ్యూరో: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) వ్యాప్తి కట్టడికి దేశమంతటా మే 4 నుంచి మూడో విడత లాక్‌డౌన్ మొదలైంది. మొదటి విడత లాక్‌డౌన్ వచ్చేనాటికి (మార్చి 25) దేశం మొత్తంమీద కేవలం 618 కరోనా పాజిటివ్ కేసులుంటే రెండో విడత లాక్‌డౌన్ నాటికి (ఏప్రిల్15) 11,933కు చేరుకుంది. ఇప్పుడు మూడో విడత లాక్‌డౌన్ నాటికి అది 42,836కు […]
– 24 గంటల్లో 2,573 కొత్త కేసులు
– తమిళనాడులో కార్చిచ్చులా కరోనా
దిశ, న్యూస్ బ్యూరో: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) వ్యాప్తి కట్టడికి దేశమంతటా మే 4 నుంచి మూడో విడత లాక్‌డౌన్ మొదలైంది. మొదటి విడత లాక్‌డౌన్ వచ్చేనాటికి (మార్చి 25) దేశం మొత్తంమీద కేవలం 618 కరోనా పాజిటివ్ కేసులుంటే రెండో విడత లాక్‌డౌన్ నాటికి (ఏప్రిల్15) 11,933కు చేరుకుంది. ఇప్పుడు మూడో విడత లాక్‌డౌన్ నాటికి అది 42,836కు చేరుకుంది. లాక్‌డౌన్‌ను విడతలవారీగా పొడిగించుకుంటూ పోతున్నా కరోనా కేసులు మాత్రం ఆగడంలేదు. సోమవారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 2,573 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా దేశంలో ప్రవేశించినప్పటి నుంచి అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 42,836కు చేరింది. వీరిలో ఇప్పటి వరకు 1,389 మంది మరణించగా సోమవారం ఒక్కరోజే 83 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇక దేశంలో ఇప్పటిదాకా డిశ్చార్జి అయిన కరోనా పేషెంట్లు 11,762 మంది ఉండగా సోమవారం ఒక్కరోజే 875 మంది డిశ్చార్జయ్యారు.
రెండ్రోజులుగా కేరళలో కేసులు నిల్..
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం 67 కొత్త పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,650కి చేరింది. ఇక్కడ ఇప్పటివరకు 524 మంది డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం రాష్ట్రంలో మరణాలేవీ నమోదు కాకపోవడం ఊరట కలిగిస్తోంది. ఏపీలో ఇప్పటిదాకా మొత్తం మరణాల సంఖ్య 33గా ఉంది. ఇక మహారాష్ట్రలో సోమవారానికి మొత్తం కేసుల సంఖ్య 12,974కు చేరుకోగా వీటిలో రాష్ట్ర రాజధాని, దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబైలోనే 9,123 కేసులున్నాయి. సోమవారం ఒక్క రోజే ముంబైలో 510 కొత్త కేసులు నమోదయ్యాయి. ముంబైలో ఇప్పటివరకు కరోనా వల్ల 361 మంది చనిపోగా సోమవారమే 18 మంది మరణించడం నగర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ముంబైలో ఇప్పటివరకు 1,908 మంది డిశ్చార్జి కాగా సోమవారం 104 మంది వ్యాధి బారి నుంచి బయటపడ్డారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,115 మంది డిశ్చార్జ్ అవగా 548 మంది చనిపోయారు. వీరిలో 27 మంది సోమవారం మరణించారు. కర్ణాటకలో సోమవారం కొత్తగా 37 పాజిటివ్ కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 651కి చేరింది. కేరళలో గడిచిన రెండ్రోజులుగా కొత్తగా ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడం విశేషం.
తమిళనాడులో కరోనా కార్చిచ్చు..
తమిళనాట సోమవారం రికార్డు స్థాయిలో 527 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో కరోనా కార్చిచ్చులా వ్యాపిస్తోంది. కొత్తగా నమోదైన ఈ కేసుల్లో చాలా వరకు చెన్నైలోని కోయంబేడు కూరగాయల మార్కెట్ నుంచే నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పేర్కొంది. కొత్తగా వచ్చిన కేసుల్లో 266 వరకు చెన్నై నగరంలో, 122 కడలూరు, 49 విల్లుపురం జిల్లాల్లో నమోదైనట్లు ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,409 మంది డిశ్చార్జి కాగా సోమవారం ఒక్క రోజే 30 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. రాష్ట్రంలో వ్యాధి బారిన పడి మొత్తం 31 మంది చనిపోగా
సోమవారం ఒకరు మరణించారు.
Tags: corona, india, monday, cases, tamil nadu highest cases, kerala nill, ghmc 3 cases