కరోనా జాగ్రత్తలు తెలిపే ‘‘కవచ్’’
దిశ వెబ్ డెస్క్: కరోనా వైరస్ నియంత్రణకు సామాజిక దూరం పాటించడం ఒక్కటే శ్రీరామ రక్ష అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నాయి. వైద్య నిపుణులు కూడా మనిషికి మనిషికి మధ్య కనీసం మీటరు దూరం ఉండాలని సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నిరంతరం శానిటైజర్.. లేదా సబ్బులో చేతులు కడుక్కోవాలని కూడా చెబుతున్నారు. అయితే ఎంతమంది ఎన్ని విధాల చెబుతున్న మనిషి వాటిని అలవాటుగా మార్చుకుంటేనే … అది సాధ్యమవుతుంది. లేదంటే.. […]
దిశ వెబ్ డెస్క్: కరోనా వైరస్ నియంత్రణకు సామాజిక దూరం పాటించడం ఒక్కటే శ్రీరామ రక్ష అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నాయి. వైద్య నిపుణులు కూడా మనిషికి మనిషికి మధ్య కనీసం మీటరు దూరం ఉండాలని సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నిరంతరం శానిటైజర్.. లేదా సబ్బులో చేతులు కడుక్కోవాలని కూడా చెబుతున్నారు. అయితే ఎంతమంది ఎన్ని విధాల చెబుతున్న మనిషి వాటిని అలవాటుగా మార్చుకుంటేనే … అది సాధ్యమవుతుంది. లేదంటే.. మనం తరుచుగా మరిచిపోతుంటాం. అయితే ఈ జాగ్రత్తలను తూచ తప్పకుండా పాటించాలంటే.. ఇతరులు మనకు మీటరు దూరంలో ఉన్నారో లేదో నిత్యం తెలుసుకోవాలంటే.. కాస్త కష్టమే! ఈ నేపథ్యంలోనే మీరు నిశ్చింతంగా ఉండండి.. ఆ పనులన్నీ తనే దగ్గరుండి గుర్తు చేస్తానని అంటోంది ‘‘కవచ్’’. ఇంతకీ ఏంటదీ?
సామాజిక దూరం పాటించడం, ప్రతీ 30 నిమిషాలకు ఒకసారి చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం… కరోనాను అరికట్టాలంటే.. ఈ జాగ్రత్తలను తూచ తప్పకుండా అమలు చేయాలి. అందుకే వైద్య నిపుణులు నెత్తీ నోరు మొత్తుకొని మనల్ని హెచ్చరిస్తున్నా ఎక్కువ మంది పాటించడం లేదు. ఇలాంటి ధోరణులను నివారించడానికి పంజాబ్‌లోని ‘లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ’కి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ప్రబిన్ కుమార్ దాస్, తన స్నేహితులతో కలిసి సరికొత్త సాధనాన్ని అభివృద్ధి చేశారు. దీని పేరు ‘కవచ్. ఈ పరికరంలో .. ఎల్‌ఇడి, వైబ్రేటర్, కంట్రోలర్, బ్యాటరీ, హ్యూమన్ బాడీ టెంపరేచర్ సెన్సర్, అల్ట్రా సోనిక్ సెన్సర్, స్టోరేజి కార్డు వంటి సూక్ష్మ పరికరాలుంటాయి. కవచ్ ను ఆభరణంగా.. లైక్ పెండెంట్ లో అమర్చి ధరించవచ్చు. కవచ్‌లో హ్యాండ్ వాష్ రిమైండర్‌తో సహా పలు ఫీచర్లు ఉంటాయి. ఈ రిమైండర్ ప్రతి 30 నిమిషాలకు ఒకసారి బీప్స్ శబ్ధం చేస్తూ చేతులు శుభ్రం చేసుకోవాలనే విషయాన్ని గుర్తు చేస్తుంది. అంతేకాదు ఈ పెండెంట్ ధరించిన వ్యక్తికి ఒక మీటరు పరిధిలోకి ఎవరు వచ్చినా… ఈ పరికరం బీప్ శబ్ధం చేస్తూ కంపిస్తుంది. లైటు మాదిరి వెలుగుతూ.. మనల్ని హెచ్చరిస్తుంది. మనం వెంటనే అప్రమత్తమై దూరం జరగ వచ్చు. చాలా మంది.. కొద్దిగా శరీరం వేడెక్కితే చాలు.. కరోనా వచ్చిందేమోనని అనుమాన పడుతూ.. ఆందోళన చెందుతున్నారు. అయితే.. ఈ కవచ్ డివైజ్ ఏం చేస్తుందంటే.. ఒక వేళ మన శరీర ఉష్ణోగ్రత నిర్దేశిత స్థాయిని మించి పెరిగినట్లయితే ఈ పరికరంలోని సెన్సర్ గ్రహించి.. మన సెల్ ఫోన్ కు ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేస్తుంది. ఈ పరికరం మరి ఎక్కవ ధర ఉండదు. వాణిజ్యపరంగా ఈ పరికరం ఉత్పత్తిని ప్రారంభించినట్లయితే మార్కెట్లో దీని ధర కేవలం రూ.400 వరకు ఉండే అవకాశం ఉంది.
Tags : CORONAVIRUS, KAVACH, INDICATOR, DEVICE, CARE,