కరోనా హెల్త్ బులెటిన్ రిలీజ్.. కేసులెన్నంటే ?
దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకు ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రజలు పెద్ద సంఖ్యలో దీని బారిన పడుతున్నారు. ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రజలను కరోనా మహమ్మారి బలిగొంటోంది. తాజాగా కేంద్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 69,878 కొత్త కేసులు నమోదయ్యాయి. 945 మంది మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 29 లక్షల 75,701కు చేరింది. ఇందులో 22 […]
దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకు ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రజలు పెద్ద సంఖ్యలో దీని బారిన పడుతున్నారు. ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రజలను కరోనా మహమ్మారి బలిగొంటోంది. తాజాగా కేంద్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 69,878 కొత్త కేసులు నమోదయ్యాయి. 945 మంది మృతిచెందారు.
దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 29 లక్షల 75,701కు చేరింది. ఇందులో 22 లక్షల 22,577 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 6 లక్షల 97,330 మంది బాధితులు కరోనాతో పోరాడుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు కరోనాతో దేశంలో 55,794 మంది మృతిచెందారు. కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.44 కోట్ల కరోనా టెస్టులు చేయగా.. అందులో గడిచిన 24 గంటల్లో 10.23 లక్షల మందికి కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది.