బెల్లంపల్లి ఆర్డీఓ ఆఫీసులో కరోనా కలకలం..

దిశ, బెల్లంపల్లి: బెల్లంపల్లి ఆర్డీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్‌కు కరోనా వ్యాధి సోకింది. గత కొంతకాలంగా తీవ్రమైన జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఆయన కోవిడ్ పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారులు తెలిపారు. కంప్యూటర్ ఆపరేటర్‌కు పాజిటివ్ రావడంతో అతనితోపాటు పనిచేస్తున్న సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. బాధితున్ని సింగరేణి ఐసోలేషన్ కేంద్రానికి తరలించి, ఆయన కుటుంబీకులను హోమ్ క్వారంటైన్‌లో ఉంచారు. అదేవిధంగా మాదారం టౌన్షిప్‌లో మరో ఇద్దరు సింగరేణి కార్మికులకు కరోనా పాజిటివ్ […]

Update: 2020-08-12 11:27 GMT
బెల్లంపల్లి ఆర్డీఓ ఆఫీసులో కరోనా కలకలం..
  • whatsapp icon

దిశ, బెల్లంపల్లి: బెల్లంపల్లి ఆర్డీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్‌కు కరోనా వ్యాధి సోకింది. గత కొంతకాలంగా తీవ్రమైన జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఆయన కోవిడ్ పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారులు తెలిపారు.

కంప్యూటర్ ఆపరేటర్‌కు పాజిటివ్ రావడంతో అతనితోపాటు పనిచేస్తున్న సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. బాధితున్ని సింగరేణి ఐసోలేషన్ కేంద్రానికి తరలించి, ఆయన కుటుంబీకులను హోమ్ క్వారంటైన్‌లో ఉంచారు. అదేవిధంగా మాదారం టౌన్షిప్‌లో మరో ఇద్దరు సింగరేణి కార్మికులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారిని గోలేటి సింగరేణి ఐసోలేషన్ కేంద్రానికి తరలించడంతో పాటు వారిని వారి కుటుంబీకులను హోమ్ క్వారంటైన్‌లో ఉంచారు.

Tags:    

Similar News