ఆరు నెలల పాటు కరోనా ప్రభావం : ఎయిమ్స్
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా బారిన పడి చికిత్స అనంతరం కోలుకున్న వారిలో చాలా కాలం పాటు దాని ప్రభావం ఉంటుందని ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. దాదాపు ఆరు నెలల పాటు కరోనా వ్యాధి అవశేషాలు శరీరంలో కనిపిస్తాయని, అలాంటి సమయంలో అలసట, బాడీ పెయిన్స్ ఉంటాయన్నారు. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉన్నవారు కరోనా నుంచి త్వరగా రికవరీ అయినా.. వారిలో కూడా అప్పుడప్పుడు శరీరం అవస్థకు గురవుతుందని వివరించారు. మరి కొంతమందిలో ఈ […]
దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా బారిన పడి చికిత్స అనంతరం కోలుకున్న వారిలో చాలా కాలం పాటు దాని ప్రభావం ఉంటుందని ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. దాదాపు ఆరు నెలల పాటు కరోనా వ్యాధి అవశేషాలు శరీరంలో కనిపిస్తాయని, అలాంటి సమయంలో అలసట, బాడీ పెయిన్స్ ఉంటాయన్నారు. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉన్నవారు కరోనా నుంచి త్వరగా రికవరీ అయినా.. వారిలో కూడా అప్పుడప్పుడు శరీరం అవస్థకు గురవుతుందని వివరించారు.
మరి కొంతమందిలో ఈ వైరస్ కొన్ని అవయవాలకు శాశ్వత నష్టం కూడా కలిగించవచ్చునని చెప్పారు. అయితే, కరోనా సోకిన వారిలో కొంతమంది చాలా ఆలస్యంగా కోలుకుంటున్నట్లు గుర్తించామని రణదీప్ వెల్లడించారు.