కరోనా ఎఫెక్ట్.. ఆర్డర్లు లేవు

దిశ, మహేశ్వరం: కరోనా ఎఫెక్ట్​వినాయక విగ్రహాల తయారీదారులపై పడింది. చవితికి మూడు నెలల ముందు నుంచే తయారీదారులకు ఆర్డర్లు వస్తుంటాయి. అందుకనుగుణంగానే విగ్రహాలు తయారు చేస్తుం టారు. కానీ, దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ తో ప్రజలు కష్టకాలంలో ఉన్నారు. దీంతో వినాయక విగ్రహాల తయారీ దారులకు గిరాకీ లేకుండాపోయింది. భారీ విగ్రహాలు తయారు చేసే వాళ్లే కాకుండా చిన్న సైజు మట్టి వినాయకులను తయారు చేసే వారి పరిస్థితి దారుణంగా మారింది. ప్రతీ ఏడాది […]

Update: 2020-08-15 20:32 GMT

దిశ, మహేశ్వరం: కరోనా ఎఫెక్ట్​వినాయక విగ్రహాల తయారీదారులపై పడింది. చవితికి మూడు నెలల ముందు నుంచే తయారీదారులకు ఆర్డర్లు వస్తుంటాయి. అందుకనుగుణంగానే విగ్రహాలు తయారు చేస్తుం టారు. కానీ, దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ తో ప్రజలు కష్టకాలంలో ఉన్నారు. దీంతో వినాయక విగ్రహాల తయారీ దారులకు గిరాకీ లేకుండాపోయింది. భారీ విగ్రహాలు తయారు చేసే వాళ్లే కాకుండా చిన్న సైజు మట్టి వినాయకులను తయారు చేసే వారి పరిస్థితి దారుణంగా మారింది. ప్రతీ ఏడాది మట్టి వినాయకులనే ప్రతిష్ఠించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తూ పెద్ద సంఖ్యలో ఆర్డర్లు ఇచ్చేది. కానీ ప్రస్తుతం ఆర్డర్లు లేక మట్టి విగ్రహతయారీ దారులు ఇబ్బందులు పడుతున్నారు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండ లం తుమ్మలూరు గ్రామానికి చెందిన కుమ్మరి శోభ, లక్ష్మయ్య దంపతులు 8ఏళ్లుగా మట్టి వినాయకుల ప్రతిమలను తయారుచేస్తున్నారు. వినాయక చవితి పండుగ మూడు నెలల ముందు నుంచే తయారీ ప్రారంభిస్తారు. రోజు కు 15నుంచి 20 వినాయకులను మూడు నెలల్లో 3వేల వరకు రూపొందిస్తారు. ఒక్కో వినాయకుడు 5 ఇంచుల నుంచి 20 ఇంచుల వరకు ఉండేలా తయారు చేస్తారు. వీరు తయారు చేసిన వినాయకులను హైదరాబాద్ లోని వ్యాపారులు ఆర్డర్ల మీద తీసుకెళ్తారు. ప్రభుత్వ సంస్థలు ప్రజల కు ఉచితంగా పంపిణీ చేయడం కోసం ముందస్తుగా తయారీదారులకు ఆర్డర్ ఇస్తారు.

గతేడాది 3వేల వినాయకులను తయారు చేశామని, అన్ని ఖర్చులూ పోను రూ.50 వేలు మిగిలినట్లు శోభ, లక్ష్మయ్య దంపతులు తెలిపారు. ప్రతీ ఏడాదిలాగే ఈ సారి కూడా సుమారు 1500 విగ్రహాలను తయారు చేసినట్లు చెప్పారు. కరోనా వైరస్ తో ఈ ఏడాది తక్కువ ఆడర్లు వచ్చాయని వాపోయారు. కులవృత్తినే నమ్ముకుని లాభనష్టాలు చూడకుండా విగ్రహాలను తయారు చేసినట్లు చెప్పా రు. వీరు తయారు చేసిన చిన్న సైజు వినాయకులు రూ.20 నుంచి రూ.60 వరకు విక్రయిస్తారు. వినాయక చవితి సీజన్ అయిపోగానే పొలం పనుల్లో బిజీగా మారుతామని అన్నారు. వినాయక ప్రతిమల తయారీకి కావా ల్సిన వ్యాన్ మట్టికి రూ.10వేలు వర కు ఉంటుందని, ప్రభుత్వం నుంచి ఎలాంటి రుణాలు కూడా అందడం లేదని శోభ, లక్ష్మయ్య దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News