బోయిన్‌పల్లి మార్కెట్ యార్డులో కరోనా డిసిన్‌ఫెక్షన్ టన్నెల్‌

దిశ, మేడ్చల్: రైతులు, కూలీలు, వ్యాపారులతో నిత్యం రద్దీగా ఉండే బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో కరోనా డిసిన్‌ఫెక్షన్ టన్నెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ టన్నెల్‌ను గురువారం కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మార్కెట్‌కు వచ్చిపోయే సమయంలో రైతులు, కూలీలు తప్పనిసరిగా శానిటైజేషన్ చేసుకోవాలన్నారు. కరోనా నివారణకు వ్యవసాయ శాఖ, ఏఎంసీ బృందం ఆధ్వర్యంలో రైతుల రక్షణ కోసం తీసుకున్న చర్యలను కొనియాడారు. కార్యక్రమంలో […]

Update: 2020-04-09 07:24 GMT

దిశ, మేడ్చల్: రైతులు, కూలీలు, వ్యాపారులతో నిత్యం రద్దీగా ఉండే బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో కరోనా డిసిన్‌ఫెక్షన్ టన్నెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ టన్నెల్‌ను గురువారం కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మార్కెట్‌కు వచ్చిపోయే సమయంలో రైతులు, కూలీలు తప్పనిసరిగా శానిటైజేషన్ చేసుకోవాలన్నారు. కరోనా నివారణకు వ్యవసాయ శాఖ, ఏఎంసీ బృందం ఆధ్వర్యంలో రైతుల రక్షణ కోసం తీసుకున్న చర్యలను కొనియాడారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, కంటోన్మెంట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, బోర్డు సభ్యులు, మార్కెట్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags: mallreddy, marri rajashekar reddy, Corona, Disinfection Tunnel, Bownpally Market Yard

Tags:    

Similar News