ఆలస్యమవుతోంది!
దిశ, నల్లగొండ: కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోన్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆరు పాజిటివ్ కేసుల నుంచి ఐదారు రోజుల్లోనే 23 కేసులకు చేరుకుంది. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన 9 మంది నుంచి ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా మరో 15 మందికి కరోనా సోకింది. ఇలా పెరుగుతున్న కేసులు ఒక వైపు అధికారులను హైరానా పెడుతున్నాయి. అయితే, ప్రైమరీ కాంటాక్ట్ రక్త పరీక్షల ఫలితాలకు ఐదారు రోజులు ఆలస్యం కావడం వల్ల జిల్తా యంత్రాగం మరింత […]
దిశ, నల్లగొండ: కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోన్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆరు పాజిటివ్ కేసుల నుంచి ఐదారు రోజుల్లోనే 23 కేసులకు చేరుకుంది. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన 9 మంది నుంచి ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా మరో 15 మందికి కరోనా సోకింది. ఇలా పెరుగుతున్న కేసులు ఒక వైపు అధికారులను హైరానా పెడుతున్నాయి. అయితే, ప్రైమరీ కాంటాక్ట్ రక్త పరీక్షల ఫలితాలకు ఐదారు రోజులు ఆలస్యం కావడం వల్ల జిల్తా యంత్రాగం మరింత అందోళన చెందుతోన్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 123 మంది నమూనాల ఫలితాలు హైదరాబాద్ నుంచి రావాల్సి ఉంది. మరో 300 మంది అనుమానితుల నమూనాలు సేకరించాల్సి ఉంది. వీటి ఫలితాలు వచ్చాక నాలుగు రోజుల్లో ఉమ్మడి జిల్లాలో కరోనా తీవ్రత ఏ మేరకు ఉందనే దానిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కరోనా పాజిటివ్ నిర్ధారణ కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీలో రక్త నమూనాలను పరీక్షిస్తున్నారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన రక్త నమూనాలు అక్కడ పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉన్న ఒత్తిడి మేరకు, నిర్దేశిత సమయంలోనే అనుమానితుల నమూనాలు సేకరించి పంపాలని హైదరాబాద్ నుంచి ఆదేశాలు రావడంతో నల్లగొండ జిల్లాలో గత మూడు రోజులుగా స్వాప్ నమూనాలు సేకరించలేదు.
తాజాగా రోజుకు ఒక జిల్లా నుంచి 30 నమూనాలను మాత్రమే పంపాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, దామెరచర్ల, నకిరేకల్, నాగర్జున్‌సాగర్, నల్లగొండ టౌన్ నుంచి సోమవారం 33 మంది ప్రైమరీ కాంటాక్ట్ అనుమానితుల నుంచి స్వాప్ నమూనాలను సేకరించారు. వీటిని హైదరాబాద్‌కు పంపించగా పరీక్షల ఫలితాలు రావడానికి ఆలస్యం అవుతుండటంతో ముందస్తు కట్టడి చర్యలు తీసుకునేందుకు అధికారులకు కష్టమవుతున్నది. పంపిన రక్తపరీక్షల ఫలితాల కోసం కలెక్టర్‌తోపాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిరంతరం ఫోన్లు చేసి వెంటపడితే తప్ప హైదారబాద్ నుంచి రిపోర్టులు పంపించడంలేదు.
ఆలస్యంపై ఆందోళన
ప్రభుత్వ ఐసొలేషన్ కేంద్రాల్లో అనుమానితులుగా ఉన్న వారికి రక్త పరీక్షలు చేయడంలో జరుగుతున్న ఆలస్యంతో వారు విసుగు చెందుతున్నారు. ఇంకెన్ని రోజులు తమను అనుమానితులుగా గుర్తించి ఆసుపత్రిలో బందీలుగా ఉంచుతారని నల్లగొండ ఐసొలేషన్ కేంద్రంలో ఉన్న అనుమానితులు గగ్గోలు పెట్టారు.
అయితే కరోనా పాజిటివ్ ప్రైమరీ కాంటాక్ట్ వారిని పరీక్షలు చేయకుండా ఖాళీగా జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మూడు రోజులుగా వేచి ఉండేలా చేయడంపై అనుమానితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని, వెంటనే పంపిస్తామని తీసుకొచ్చి రోజుల తరబడి ఉంచడం, నమూనాలు సేకరించకపోవడపై వారు ఆగ్రహం చేస్తున్నారు.
ఇక తొలుత గుర్తించిన ఆరు పాజిటివ్ కేసులకు సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించేందుకు వైద్య బృందాలు సర్వే నిర్వహించగా అందులో 26 మంది అనుమానితులు వెలుగులోకి వచ్చారు. వారి స్వాప్ నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాల్సి ఉంది.
Tags: blood test, sample, report delay, quarantine, anxiety,