కామారెడ్డిలో మరో కరోనా మరణం

దిశ, వెబ్ డెస్క్: కామారెడ్డిలో మరో కరోనా మరణం సంభవించింది. జిల్లాలోని ఏరియా ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి ఆదివారం ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 17న ఆర్టీసీ బస్టాండ్ వద్ద తీవ్ర అనారోగ్యంతో నరకయాతన అనుభవిస్తున్న హనుమంతు అనే వ్యక్తిని 108 ద్వారా ఆర్టీసీ అధికారులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. రెండ్రోజులుగా కరోనాతో పోరాడుతూ.. చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలాడు. అయితే, మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు బంధువులు […]

Update: 2020-07-19 06:19 GMT

దిశ, వెబ్ డెస్క్: కామారెడ్డిలో మరో కరోనా మరణం సంభవించింది. జిల్లాలోని ఏరియా ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి ఆదివారం ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 17న ఆర్టీసీ బస్టాండ్ వద్ద తీవ్ర అనారోగ్యంతో నరకయాతన అనుభవిస్తున్న హనుమంతు అనే వ్యక్తిని 108 ద్వారా ఆర్టీసీ అధికారులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. రెండ్రోజులుగా కరోనాతో పోరాడుతూ.. చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలాడు. అయితే, మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు బంధువులు నిరాకరించడంతో మున్సిపల్ సిబ్బంది దహన సంస్కారం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, జిల్లాలో కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Tags:    

Similar News