కోయంబేడు మార్కెట్‌లో కరోనా కలకలం
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఈ మార్కెట్‌లో పనిచేస్తున్న కూలీలకు ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో 54 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో చెన్నైవాసులతో పాటు అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ యార్డుగా కోయంబేడు మార్కెట్ నడుస్తోంది. కోయంబేడు కేంద్రంగా ఏపీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు భారీగా ఎగుమతి, దిగుమతులు జరుగుతుంటాయి. లాక్‌డౌన్ మొదలైన తర్వాత ఏప్రిల్ నెలలో ఈ మార్కెట్ కరోనాకు […]
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఈ మార్కెట్‌లో పనిచేస్తున్న కూలీలకు ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో 54 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో చెన్నైవాసులతో పాటు అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ యార్డుగా కోయంబేడు మార్కెట్ నడుస్తోంది. కోయంబేడు కేంద్రంగా ఏపీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు భారీగా ఎగుమతి, దిగుమతులు జరుగుతుంటాయి. లాక్‌డౌన్ మొదలైన తర్వాత ఏప్రిల్ నెలలో ఈ మార్కెట్ కరోనాకు హాట్‌స్పాట్‌గా మారింది. ఈ నేపథ్యంలో కొద్దిరోజులు ఈ మార్కెట్‌ని మూసేశారు. కాగా, ఇటీవల కోయంబేడు మార్కెట్‌లో అమ్మకాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో మార్కెట్‌కు జనం పోటెత్తారు. ఈ సమయంలో మళ్లీ కరోనా కేసులు నమోదవుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది.