మంచిర్యాలలో కరోనా ప్రమాద ఘంటికలు.. ఒక్కరోజే 436 కేసులు

దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో గురువారం 436 మందికి కరోనా సోకింది. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రితో పాటు చెన్నూర్, బెల్లంపల్లి, లక్షేటిపేట, సీహెచ్‌సీ పరిధిలోని నాలుగు అర్బన్ పీహెచ్సీలు, 17 పీహెచ్సీలలో 2,138 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 436 మంది కరోనా బారిన పడ్డారు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని, ప్రతి ఒక్కరూ మాస్కులు […]

Update: 2021-04-15 08:07 GMT

దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో గురువారం 436 మందికి కరోనా సోకింది. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రితో పాటు చెన్నూర్, బెల్లంపల్లి, లక్షేటిపేట, సీహెచ్‌సీ పరిధిలోని నాలుగు అర్బన్ పీహెచ్సీలు, 17 పీహెచ్సీలలో 2,138 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 436 మంది కరోనా బారిన పడ్డారు.

రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని డాక్టర్ బాలాజీ తెలిపారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Tags:    

Similar News