కరోనా హాట్‌స్పాట్‌గా వరంగల్

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య జిల్లాల్లో గణనీయంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో ఒక్క వరంగల్ అర్బన్ జిల్లాలోనే 117 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అన్ని జిల్లాల్లోకెల్లా వరంగల్ అర్బన్‌లోనే అత్యధిక సంఖ్యలో నమోదయ్యాయి. హైదరాబాద్ నుంచి చాలామంది సొంతూళ్ళకు వెళ్ళే ఉద్దేశంతో తిరుగు ప్రయాణమైన తర్వాత జిల్లాలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య విభాగం అధికారులు పేర్కొంటున్నారు. ఈ జిల్లాతో పాటు కరీంనగర్, నల్లగొండ, కామారెడ్డి, మెదక్, పెద్దపల్లి తదితర జిల్లాల్లో […]

Update: 2020-07-19 11:36 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య జిల్లాల్లో గణనీయంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో ఒక్క వరంగల్ అర్బన్ జిల్లాలోనే 117 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అన్ని జిల్లాల్లోకెల్లా వరంగల్ అర్బన్‌లోనే అత్యధిక సంఖ్యలో నమోదయ్యాయి. హైదరాబాద్ నుంచి చాలామంది సొంతూళ్ళకు వెళ్ళే ఉద్దేశంతో తిరుగు ప్రయాణమైన తర్వాత జిల్లాలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య విభాగం అధికారులు పేర్కొంటున్నారు. ఈ జిల్లాతో పాటు కరీంనగర్, నల్లగొండ, కామారెడ్డి, మెదక్, పెద్దపల్లి తదితర జిల్లాల్లో కూడా ఎక్కువగానే కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో జిల్లాల్లో నమోదవుతున్నవి దాదాపుగా సగంగా ఉంటుంటే ఆదివారం మాత్రం జిల్లాల్లోని కేసులే ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ కేసులు స్వల్పంగా తగ్గుతున్నాయి. వెయ్యి కేసులు నమోదయ్యే పరిస్థితి నుంచి ఇప్పుడు 500 కేసుల దాకా తగ్గుముఖం పట్టింది. ఇంతకాలం హైదరాబాద్ నగరం కరోనా హబ్‌గా ఉంటే ఇప్పుడు పరిస్థితి కొద్దిగా అదుపులోకి వచ్చినట్లు గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. గడచిన 24 గంటల్లో 12,519 టెస్టులు చేస్తే 1,296 (10%) పాజిటివ్ కేసులు వచ్చాయని, కానీ దీనికంటే డిశ్చార్జి అవుతున్న కేసుల సంఖ్యే ఎక్కువగా ఉన్నదని ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ విడుదల చేసిన బులిటెన్ పేర్కొంది. ఒక్క రోజులోనే 1,831 మంది డిశ్చార్జి అయ్యారని, మొత్తం పాజిటివ్ కేసుల్లో సుమారు 72% రికవరీ ఉన్నట్లు పేర్కొంది.

Tags:    

Similar News