దేశంలో కరోనా విజృంభణ…
దిశ వెబ్ డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ ఏ మాత్రం ఆగడం లేదు. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగి పోతోంది. కేంద్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులిటెన్ ప్రకారం…గడిచిన 24 గంటల్లో 85,362 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 1089 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 93,379కి చేరింది. ఇక దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా […]
దిశ వెబ్ డెస్క్ :
దేశంలో కరోనా విజృంభణ ఏ మాత్రం ఆగడం లేదు. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగి పోతోంది. కేంద్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులిటెన్ ప్రకారం…గడిచిన 24 గంటల్లో 85,362 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 1089 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 93,379కి చేరింది. ఇక దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 59,03,933గా ఉంది. వీటిలో 9,60,969 యాక్టివ్ కేసులు ఉన్నాయి. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పటి వరకు 48,49,585 మంది డిశ్చార్జ్ అయినట్టు అధికారులు చెబుతున్నారు.