మాస్క్ పెట్టుకోలేదని యువకుడిని చితకబాదిన పోలీసులు..
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా మాస్క్, భౌతిక దూరం, కొవిడ్ రూల్స్ పాటించాలని హెచ్చరిస్తున్నాయి. కానీ, కొందరు మాత్రం కరోనా రూల్స్ పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాజాగా ఒడిశా రాష్ట్రం భద్రక్ జిల్లాలోని ఓ దేవాలయానికి శుభరంజన్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. ఈ సందర్భంగా […]
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా మాస్క్, భౌతిక దూరం, కొవిడ్ రూల్స్ పాటించాలని హెచ్చరిస్తున్నాయి. కానీ, కొందరు మాత్రం కరోనా రూల్స్ పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాజాగా ఒడిశా రాష్ట్రం భద్రక్ జిల్లాలోని ఓ దేవాలయానికి శుభరంజన్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు.
ఈ సందర్భంగా శుభరంజన్ మాస్కు ధరించలేదు. కరోనా వేళ మాస్క్ పెట్టుకోలేదనే కారణంగా శుభరంజన్‌ను అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు చితకబాదారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే తన కుమారుడి పట్ల దారుణంగా వ్యవహరించిన పోలీసుల పట్ల తగు చర్యలు తీసుకోవాలని అతడి తండ్రి.. భద్రక్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.