వైఫై, బ్లూటూత్‌తో నడిచే కూలర్
దిశ, వెబ్‌డెస్క్: ఎండాకాలం వచ్చేస్తోందంటే కూలర్ తప్పనిసరిగా ఉండాల్సిందే.. లేకపోతే ఈ ఎండలకు తట్టుకోలేం. కూలర్‌ని కంట్రోల్ చేయడానికి రిమోట్ ఉంటే బాగుండని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఆ సమస్యను తీర్చడానికే రాజస్థాన్‌కి చెందిన భారతీయ స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ (బీఎస్‌డీయూ) విద్యార్థులు వైఫై, బ్లూటూత్ ద్వారా పనిచేసే కూలర్‌ని తయారుచేశారు. ఈ కూలర్‌ని స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ ద్వారా ఎక్కడినుంచైనా నియంత్రించుకోవచ్చు. ఇందులో అమర్చిన పవర్ అడాప్టర్ వల్ల ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నపుడు ఆటోమేటిక్‌గా కూలర్ […]
దిశ, వెబ్‌డెస్క్:
ఎండాకాలం వచ్చేస్తోందంటే కూలర్ తప్పనిసరిగా ఉండాల్సిందే.. లేకపోతే ఈ ఎండలకు తట్టుకోలేం. కూలర్‌ని కంట్రోల్ చేయడానికి రిమోట్ ఉంటే బాగుండని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఆ సమస్యను తీర్చడానికే రాజస్థాన్‌కి చెందిన భారతీయ స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ (బీఎస్‌డీయూ) విద్యార్థులు వైఫై, బ్లూటూత్ ద్వారా పనిచేసే కూలర్‌ని తయారుచేశారు.
ఈ కూలర్‌ని స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ ద్వారా ఎక్కడినుంచైనా నియంత్రించుకోవచ్చు. ఇందులో అమర్చిన పవర్ అడాప్టర్ వల్ల ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నపుడు ఆటోమేటిక్‌గా కూలర్ ఆఫ్ అవుతుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారంగా రూపొందించిన ఈ కూలర్ 60 ఏళ్ల వరకు పనిచేస్తుందని బీఎస్‌డీయూ ప్రొవోస్ట్ కల్నల్ రాజ్ కుమార్ అన్నారు. అలాగే వాటర్ సేవింగ్ టెక్నాలజీ వల్ల కార్బన్ ఎమిషన్ కూడా తగ్గుతుందని చెప్పారు. ఈ కూలర్ తయారుచేయడంలో మనోజ్, వికాస్ అనే విద్యార్థులు తనకు సాయం చేసినట్లు కుమార్ తెలిపారు.
Tags: Smart Cooler, Bluetooth, Wifi, Internet of Things, Automatic, Water Saving Technology