Rahul: గుజరాత్ నుంచే బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ల పతనం ప్రారంభం.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
గుజరాత్ నుంచే బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ల పతనం ప్రారంభం అవుతుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్ నుంచే బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ల పతనం ప్రారంభం అవుతుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) మాత్రమే ఈ రెండింటినీ ఓడించగలదని దీమా వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని మోడసాలో బుధవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో రాహుల్ ప్రసంగించారు. ‘కాంగ్రెస్ పార్టీకి గుజరాత్ అత్యంత ముఖ్యమైన రాష్ట్రం. అయితే ఇక్కడ మనం నిరాశకు గురైనట్లు కనిపిస్తోంది. కానీ రాష్ట్రంలో బీజేపీని ఓడిస్తాం. ఇది కష్టమేం కాదు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆర్ఎస్ఎస్, బీజేపీని ఓడించగలదు. ఈ విషయం దేశం మొత్తం తెలుసు’ అని వ్యాఖ్యానించారు. దేశ సంపదను కొంత మంది బిలియనీర్లకు మోడీ ప్రభుత్వం దోచిపెడుతుందని ఆరోపించారు. ముగ్గురు బిలియనీర్లకే దేశ వనరులన్నీ అప్పగిస్తున్నామని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.