వివాదంలో ‘మిషన్ ఇంపాజిబుల్’ పోస్టర్

దిశ, వెబ్‌డెస్క్ : ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌‌ ఎంచుకుని తొలి సినిమాతోనే సక్సెస్ అయిన దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్‌జె.. తన రెండో ప్రాజెక్ట్‌గా ‘మిషన్ ఇంపాజిబుల్(Mishan Impossible)’ మూవీని ఇటీవలే అనౌన్స్ చేశాడు. ఈ క్రమంలోనే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేయగా.. అది కాస్తా వివాదానికి దారి తీసింది. Clarification in relation to certain objections raised about a recent poster of “Mishan […]

Update: 2020-12-13 00:47 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌‌ ఎంచుకుని తొలి సినిమాతోనే సక్సెస్ అయిన దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్‌జె.. తన రెండో ప్రాజెక్ట్‌గా ‘మిషన్ ఇంపాజిబుల్(Mishan Impossible)’ మూవీని ఇటీవలే అనౌన్స్ చేశాడు. ఈ క్రమంలోనే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేయగా.. అది కాస్తా వివాదానికి దారి తీసింది.

హిందూ దేవుళ్ళ వేషధారణల(హనుమంతుడు, శివుడు, శ్రీకృష్ణుడు)తో ఉన్న ముగ్గురు చిన్నపిల్లల చేతుల్లో తుపాకీలుండటంతో పోస్టర్‌పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హిందువుల మనోభావాలను కించపరిచిన మూవీ యూనిట్‌పై కేసులు నమోదు చేయాలంటూ నెటిజన్లు ట్వీట్స్ చేశారు. కాగా ఈ వివాదంపై వెంటనే స్పందించిన చిత్ర దర్శక నిర్మాతలు.. ఏ వర్గానికి చెందిన వారి మనోభావాలను, సెంటిమెంట్స్‌ను కించపరిచే ఉద్దేశం తమకు లేదని, పోస్టర్‌ను వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు.

Tags:    

Similar News