కంటెయిన్‌మెంట్ జోన్ల కోసం కంట్రోల్ రూములు
– జీహెచ్ఎంసీ కమిషనర్‌కు అరవింద్ కుమార్ ఆదేశాలు దిశ, న్యూస్‌బ్యూరో: కంటెయిన్‌మెంట్ జోన్‌ల విషయమై ఆయా జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఆఫీసుల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించాలని, తెలుగు, ఉర్దూ భాషల్లో కరపత్రాలు ప్రింట్ చేసి జోన్లలోని ప్రజలకు పంపిణీ చేయాలని తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్వి అరవింద్ కుమార్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ నోడల్ ఆఫీసర్‌గా ఏర్పాటయ్యే కంటెయిన్‌మెంట్ టీంలో జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు, రెవెన్యూ ఇతర డిపార్ట్‌మెంట్లకు చెందిన […]
– జీహెచ్ఎంసీ కమిషనర్‌కు అరవింద్ కుమార్ ఆదేశాలు
దిశ, న్యూస్‌బ్యూరో: కంటెయిన్‌మెంట్ జోన్‌ల విషయమై ఆయా జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఆఫీసుల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించాలని, తెలుగు, ఉర్దూ భాషల్లో కరపత్రాలు ప్రింట్ చేసి జోన్లలోని ప్రజలకు పంపిణీ చేయాలని తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్వి అరవింద్ కుమార్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ నోడల్ ఆఫీసర్‌గా ఏర్పాటయ్యే కంటెయిన్‌మెంట్ టీంలో జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు, రెవెన్యూ ఇతర డిపార్ట్‌మెంట్లకు చెందిన అధికారులుండాలన్నారు. ఈ జోన్‌లలో ఉన్న ప్రజలకు నిత్యావసరాలు అందజేయడానికి ఇతర అవసరాల తీర్చడానికి ఈ టీం కృషి చేయాలని కోరారు. కంటెయిన్‌మెంట్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలను జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్‌తో కలిసి అరవింద్‌కుమార్ శుక్రవారం సమీక్షించారు. కంటెయిన్‌మెంట్ జోన్‌లలో ప్రజలు బయట తిరగడానికి అనుమతించొద్దని వారంతా ఇళ్లలోనే ఉండేలా చూడాలన్నారు. పాజిటివ్ కేసులున్న చోట సరైన నిబంధనలను పాటించాలని సూచించారు. ఎప్పటికప్పుడు శానిటేషన్, స్ప్రేయింగ్, ఆరోగ్య సిబ్బంది విజిట్ చేయడం లాంటివి ఈ జోన్‌లలో ఎప్పటికప్పుడు జరిగేలా చూడాలన్నారు.
Tags : control rooms, containment zones, ghmc, telangana